వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాఫో: మగవాళ్లు చూడని కొత్త ప్రపంచాన్ని చూపించిన తొలి లెస్బియన్ కవయిత్రి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గ్రీసు దేశంలో లెస్బోస్‌‌కు చెందిన సాఫో (క్రీస్తు పూర్వం 620-570) ప్రముఖ ప్రాచీన కవయిత్రి.

గ్రీసు దేశంలోని లెస్బోస్‌కు చెందిన సాఫో ప్రముఖ ప్రాచీన కవయిత్రి. ఆమె మరణించి కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. కానీ, ఇప్పటికీ విగ్రహాలు, నాణేలు, మట్టి పాత్రలపై ఆమె జ్ఞాపకాలను పొందుపరిచి స్మరించుకుంటున్నారు.

ఆమె కాలాతీతంగా నిలిచారు. ప్రపంచ చరిత్రలో ఆమెను తొలి స్వలింగ సంపర్క కవయిత్రి అని చెబుతారు.

స్వలింగ సంపర్కులకుండే భావాలను, వారిలో దాగిన సౌందర్యాన్ని ఆమె తన కవిత్వంలో అక్షరీకరించారు. స్వలింగ సంపర్కులకుండే కళాత్మక సౌందర్యాన్ని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకుని రావాలని ప్రయత్నించారు.

ఆమె జన్మస్థలం లెస్బోస్ అనే దీవి నుంచే లెస్బియన్ అనే పదం పుట్టిందనే ఊహాగానాలూ ఉన్నాయి.

ఆమె మరణం తర్వాతే ఆమెకు తగినంత గుర్తింపు లభించింది. ఆమె రాసిన కవితల సంఖ్య తక్కువే. కానీ, ఆమె రాసిన కవిత్వంలో కేవలం 650 పంక్తులే అందుబాటులో ఉన్నాయి.

ఆమె రాసిన ప్రేమ కవిత్వాన్ని మధ్య యుగానికి చెందిన చర్చి ధ్వంసం చేసిందని కొంత మంది చెబుతారు. ప్రాచీన సమాజాల్లో స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణించేవారు.

ఆమె కవిత్వాన్ని తగలబెట్టమని క్రీ.పూ. 1073లో పోప్ గ్రెగరీ VII ఆదేశించినట్లు చెబుతారు.

గ్రీకు మాండలికం ఏయోలిక్‌లో రాయడం కూడా ఆమె కవితలు కనుమరుగవడానికి కారణమని చెబుతారు. వీటిని అనువాదం చేయడం కష్టం కావడంతో అనువాద బాధ్యతను ఎవరూ చేపట్టకపోవడం వల్ల కూడా అవి పోయి ఉండవచ్చని చెబుతారు.

కాపీ చేసిన పద్యాలు మాత్రమే కాలాన్ని తట్టుకుని నిలబడి ఆమె కవిత్వ గొప్పతనం గురించి చాటుతున్నాయి.

ఈ పద్యాల్లో రాసిన వ్యాఖ్యల ద్వారానే పురావస్తు శాస్త్రవేత్తలు ఆమె జీవితాన్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆమె జీవిత చరిత్రను ఆమె బతికి ఉన్నప్పుడు గానీ లేదా ఆమె మరణానంతరం గాని రాసి ఉంటారు.

గ్రీసు దేశంలో ఉన్నపరియన్ పాలరాతి శిలా శాసనాలు (క్రీస్తు పూర్వం 1582 - 299 మధ్య కాలం నాటి చరిత్రను, కొన్ని ఘటనలను తెలియచేసే శాసనాలు) మినహా ఆమె రచనలను స్పష్టంగా తెలియచేసే వేరే ఆధారాలేవీ లేవు.

ప్లేటో (క్రీస్తు పూర్వం 428/427 - 348/347 ) రచనల్లో సాఫో పట్ల ఆరాధన కనిపిస్తుంది. ప్లేటో కూడా తన రచనల్లో స్వలింగ సంపర్కుల గురించి రాశారు.

సాఫోను ప్రముఖ స్వలింగ సంపర్క కవయిత్రిగా నేడు గౌరవిస్తున్నారు. ఎల్‌జీబీటీక్యూ సమాజంలో మాత్రమే కాకుండా ఇతరులకూ ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

సాఫోను ప్రముఖ స్వలింగ సంపర్క కవయిత్రిగా నేడు గౌరవిస్తున్నారు.

సాఫో జీవితం

ప్రాచీన గ్రీసు దేశంలో లెస్బోస్ దీవిలో ఒక ఉన్నతవర్గానికి చెందిన కుటుంబంలోసాఫో జన్మించారు.

ఆమె కుటుంబానికున్న ఐశ్వర్యం ఆధారంగా పరిశోధనకారులు ఈ విషయాన్ని చెబుతున్నారు.

ఆమె జీవితంలో నచ్చిన మార్గాన్ని ఎంచుకోవడానికి ఆమెకు స్వతంత్రం ఉంది. అయితే, కొందరు ఈ వాదనను ఖండిస్తారు.

"ప్రాచీన గ్రీసులో చాలా మంది మహిళలు వారి ప్రాంతం, నగరంలో ఉన్న సంప్రదాయాలను పాటించేవారు. వారి సంప్రదాయానికనుగుణంగా వారు వివాహం చేసుకోవాలి. ఆమె ఐశ్వర్యం, కుటుంబ నేపథ్యం కూడా సమాజపు కట్టుబాట్ల నుంచి కాపాడలేకపోయాయి. లెస్బోస్‌లో మహిళలను గౌరవంగా చూస్తారు. సాఫో విభిన్నమైన వ్యక్తిత్వం కలవారు కావడంతో ఆమె తన సొంత మార్గాన్ని ఎంచుకున్నారు" అని వెండీ స్లాట్ కిన్ అనే చరిత్రకారుడు చెప్పారు.

"మహిళలకు చాలా నిబంధనలుండేవి. వారు సమాజంలో స్వేచ్ఛగా తిరగగలిగేవారు కాదు. వారు వ్యాపారం చేయడానికి వీలుండేది కాదు. వారు స్థానిక పరిమితులను దాటి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉండేది కాదు. ఇటువంటి ఆంక్షల వల్ల ఆ కాలంలో ఉన్న ముఖ్యమైన మహిళల గురించి తెలియలేదు.

ఇదేమీ ఆశ్చర్యపోయే విషయం కాదు. "గ్రీసు దేశంలో ప్లేటో మాత్రమే సాఫో ప్రతిభను గుర్తించారు. ఆయనా లెస్బోస్‌కు చెందినవారు కావడం వల్ల ఇది సాధ్యమైంది". అని ఆమె వివరించారు.

అయితే, ప్లేటో నిజంగా సాఫోను ఆరాధించారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఆయన ఆరాధించినట్లుగా ఎక్కడా బలమైన ఆధారాలు లేవు. ప్లేటో తర్వాత కాలంలో కూడా ఆమె రచనలు బయట పడి ఉండవచ్చని కొందరు భావిస్తారు.

ఆమె స్వలింగ సంపర్కుల కోసం స్కూల్ కూడా నడిపారని చెబుతారు. కానీ, ఆమె దగ్గర చదువుకున్న విద్యార్థి డాంఫిలా పాంఫిలియాలో అమ్మాయిల కోసం స్కూలును నడిపారని కొంత మంది చరిత్రకారులు చెబుతారు. దానినే సాఫో నడిపిన స్కూలు అని తప్పుగా అనుకుంటారని 19వ శతాబ్దపు అధ్యయనకారులు చెబుతారు.

వివాహానికి ముందు తగిన శిక్షణ పొందడానికి, సాఫో బోధనల ద్వారా భావాల గాఢతను అర్థం చేసుకునేందుకు ఉన్నత వర్గాలకు చెందిన వారు తమ ఆడ పిల్లలను ఈ స్కూలుకు పంపేవారని చెబుతారు.

చరిత్రకారులు ఆమె జీవితానికి సంబంధించిన అన్ని వివరాలను వెలికి తీయలేకపోయారు. కానీ, ఆమె సంగీతాన్ని నేర్చుకునేందుకు అవకాశమున్న ప్రాంతంలో పెరిగారు. ఆమె భర్తను కోల్పోయారని.. ఆమెకు క్లీస్ అనే పేరున్న కూతురు కూడా ఉండేదని మరి కొందరు చెబుతారు. సాఫో తల్లి పేరూ అదేనంటారు మరికొందరు.

సాఫోకు ఎరిజిస్, చరాక్సస్, లారిచస్ అనే ముగ్గురు తోబుట్టువులు ఉండేవారని చెబుతారు. సాఫో కవితల్లో చరాక్సస్, లారిచస్ ప్రస్తావన కనిపిస్తుంది. ఆమెకున్న రాజకీయ అభిప్రాయాల కారణంగా ఆమె రెండు సార్లు సిసిలీ నుంచి బహిష్కరణకు గురయ్యారని చరిత్రకారుడు విక్కీ లియాన్ చెబుతారు.

గ్రీసు దేశంలో లెస్బోస్‌‌కు చెందిన సాఫో (క్రీస్తు పూర్వం 620-570) ప్రముఖ ప్రాచీన కవయిత్రి.

ఆమె పొట్టిగా ఉండి గోధుమ రంగులో ఉండేవారని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.

ఆమె కవితలలో స్వలింగ సంపర్కుల మధ్య ప్రేమను ప్రస్తావించినప్పటికీ అవి ఆమె జీవితానికి సంబంధించినవిగా చూడరాదని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు.

వేరే కవుల అడుగుజాడల్లో నడుస్తూ కూడా ఇలా రాసి ఉండొచ్చని చెబుతున్నారు.

ఆమె కవితల ఆధారంగా ఆమె లైంగికత గురించి కొంత మంది చరిత్రకారులు నిర్ధరణకు వచ్చారు.

ఈ చర్చల నుంచి ఆమె లైంగికతను వేరు చేసి చూడటం న్యాయం కాదని చరిత్రకారులు రిచర్డ్ లివింగ్స్టన్ అన్నారు. ఆమె చాలా అంశాల గురించి తన కవితల్లో మాట్లాడి ఉంటారని అన్నారు.

"సాఫో నిజానికి కొన్ని వేల కవితలు రాశారు. అందులో అందుబాటులో ఉన్నవి చాలా తక్కువ. వాటిలో లైంగికత, స్వలింగ సంపర్కుల మధ్య ప్రేమకు సంబంధించినవి ఉండటం వల్ల ఆమె స్వలింగ సంపర్కురాలని తీర్మానించడం సరైనది కాదు" అని ఆయన అన్నారు.

సాఫో లైంగిక సంబంధాలు

సాఫో స్వలింగ సంపర్క కవయిత్రి అని చాలా మంది అంటారు. ఆమె తర్వాత గ్రీకు కవి అనాక్రియాన్ (క్రీస్తు పూర్వం 582-485) లెస్బోస్ దీవికి చెందిన మహిళలను లెస్బియన్లు అని పిలవడం మొదలుపెట్టారు.

ఆమె లైంగికత ఏదైనప్పటికీ, ఆమె కవిత్వంలో మాత్రం మహిళల సౌందర్యం, ప్రేయసీ ప్రియుల మధ్య రొమాన్స్ గురించి అద్భుతంగా వర్ణించారు.

"పురుషులు గతంలో ఎన్నడూ చూడని ప్రపంచాన్ని సాఫో కవితలు వర్ణిస్తాయి. స్త్రీ, పురుషులను కావాలని వేర్వేరుగా పెట్టిన సమాజంలో ఆమె కవితలు మహిళల్లో ఒకరిపై ఒకరికి ఉండే గాఢమైన ప్రేమను వ్యక్తీకరిస్తాయి" అని మేరీ ఆర్ లెఫ్ కోవిట్జ్ , మారీన్ బి ఫాంట్ అనే నిపుణులు చెబుతున్నారు.

స్వలింగ సంపర్కుల మధ్య ఉండే ప్రేమను వ్యక్తీకరించడంతో ఆమె చూపిన ప్రతిభ ఆమె లైంగిక ఆసక్తులు గురించి ఆలోచింపచేసేలా చేసింది. అయితే, దీనిని కచ్చితంగా ఎవరూ నిరూపించలేరు.

ప్రేమలో పడినప్పుడు కలిగే ఆనందం సాఫో కవితల్లో కనిపిస్తుంది. ఆమె రాసిన ఓడ్ టూ ఆఫ్రొడైట్ తప్ప మిగిలిన కవితలన్నిటినీ నాశనం చేశారు.

మిగిలిన కొన్ని కవితలతోనే చరిత్రకారులు ఆమె కవితల్లో దాగిన ప్రేమైక సౌందర్యాన్ని తిరిగి సృష్టించేందుకు చూస్తున్నారు.

ఆమె రాసిన చాలా కవితలు రొమాంటిక్ లవ్‌కు నిదర్శనాలుగా ఉంటాయి.

ఓడ్ టూ ఆఫ్రో డైట్‌లో ఆమె ఆకర్షితురాలైన ఒక మహిళ ప్రేమను పొందేందుకు దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఉంటుంది. అలా అని ఆమె నిరంతరం అదే పనిలో ఉన్నట్లు కనిపించరు. ఒక లైనులో "నీ అంత చికాకు కలిగించే మహిళను నేనింత వరకూ చూడలేదు" అని కూడా రాశారు.

కొత్త ఆవిష్కరణలు

ఎవరో ఇచ్చిన కాగితాల చుట్టలో సాఫో కవిత్వం ఉందని కొన్నిసంవత్సరాల క్రితం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు చెప్పారు. ఆ కాగితాల చుట్టలో ఆమె రాసిన తొలి పుస్తకానికి చెందిన కొన్ని విభాగాలు ఉన్నాయని అమెరికాకు చెందిన పాపిరాలజిస్ట్ డాక్టర్ డిర్క్ ఆబింక్ చెప్పారు.

ప్రాచీన గ్రీసు దేశానికి చెందిన సోలోన్‌ను ఆయన తరానికి చెందిన వారు బాగా గౌరవించేవారు. ఆయనను గ్రీసు దేశంలో ఉన్న ఏడుగురు పవిత్ర వ్యక్తులలో ఒకరిగా కీర్తించేవారు. ఆయన బోధనలలో ఉన్న మితవాదం వల్ల ఆయన బాగా ప్రసిద్ధి పొందారు.

అయితే, సాఫోస్ జీవితం గురించి గాని, మరణం గురించి గాని, ఎక్కువ వివరాలు అందుబాటులో లేవు.

ఆమె ప్రేమను ఫాన్ అనే నావికుడు తిరస్కరించడంతో ల్యూకేడియన్ శిఖరం అంచుల నుంచి దూకి చనిపోయారని గ్రీక్ హాస్య నటుడు మెనాన్డర్ (క్రీస్తు పూర్వం 341 - 329) చెప్పారు. అయితే, చరిత్రకారులు దీనిని ఖండించారు.

స్వలింగ సంపర్కురాలిగా ఆమె ఉనికిని నాశనం చేసేందుకు మెనాన్డర్ హాస్యంగా అల్లిన కథ అదంతా అని చెబుతారు.

సాహిత్య వర్గాల్లో ఈమె గురించి చాలా సిద్ధాంతాలు వినిపిస్తాయి. కానీ, ఆమె వృద్ధాప్యం వల్లే మరణించారని చరిత్రకారులు నమ్ముతారు.

ఆమె కవితలు చాలా ప్రసిద్ధి చెందాయని లెస్బోస్‌కు చెందిన ప్రజలు ఆమెను ఆరాధిస్తారని గ్రీకు తత్వవేత్త లియాన్ అంటారు.

ఆమె మరణం తర్వాత కూడా ఆమె కవితలు సజీవంగానే ఉన్నాయి.

ఆమె కవితలకు 'అమరంగా ఉండే అమ్మాయిలు' అని పేరు పెట్టారు. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆమె కవితలను ఆధునిక ప్రపంచం సంస్మరించుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Sappho: The first lesbian poet to show a new world that men have never seen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X