ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..!

ఇరాన్ (IRAN) పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడిగా ప్రారంభించిన యుద్దం గల్ఫ్ దేశాలకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఆ దేశంతో అంటకాగుతున్న సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే తమ దేశాల్లోని అమెరికా బేస్ లు, ఇతర ఆస్తులపై దాడులకు దిగుతున్న ఇరాన్.. తాజాగా చమురు క్షేత్రాలపైనా ఫోకస్ పెట్టింది. ట్రంప్ తాజా హెచ్చరికలతో ఇప్పుడు తమ దేశంలోని ఉప్పునీటిని మంచి నీటిగా మార్చే ప్లాంట్లపై దాడులకు హెచ్చరికలు చేసింది. దీంతో ఇలాంటి అతిపెద్ద ప్లాంట్ కలిగిన సౌదీ అరేబియా (saudi arabia) కు టెన్షన్ పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో గతేడాది తమతో రక్షణ ఒప్పందం చేసుకున్న పాకిస్తాన్ (pakistan) పై సౌదీ అరేబియా ఒత్తిడి పెంచుతోంది. ఇరాన్‌ పై దాడులకు దిగాలని పాకిస్తాన్ ను కోరుతోంది. ఇందుకోసం 2025లో చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని గుర్తు చేస్తోంది. సౌదీ నిపుణుల ద్వారా కెనడాకు పంపిన సందేశంలో.. పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలని సౌదీ కోరింది. అయితే ఇరాన్‌తో ఎలాంటి సంఘర్షణ అయినా పాకిస్తాన్‌కు తీవ్ర వ్యూహాత్మక ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. షియా మెజారిటీ ఇరాన్‌పై దాడి దేశంలో విస్తృత మతపరమైన అశాంతికి దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Saudi Arabia Urges Pakistan to Strike Iran Riyadh Cites 2025 Defense Pact

యెమన్‌లో భూతల దాడుల్లో సవాళ్ల తర్వాత, సౌదీ అరేబియా పాకిస్తాన్ యొక్క పెద్ద, అనుభవజ్ఞులైన సైన్యంపై ఆధారపడుతోంది. ఈ రక్షణ ఒప్పందం సౌదీకి పాకిస్తాన్ అణు నిరోధక రక్షణ కూడా ఇస్తుంది. అలాగే అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి, ఇరాన్‌కు వ్యతిరేకంగా సౌదీ స్థానాన్ని కాపాడుతుంది. ఈ ఒప్పందం అమలైతే పాకిస్థాన్ సైన్యం ఇరాన్ తూర్పు సరిహద్దు వెంబడి మరో యుద్దం ప్రారంభించవచ్చు, లేదా హార్ముజ్ జలసంధి భద్రతకు సహాయపడి సౌదీ దళాలకు భారీ ప్రాణనష్టం నివారించగలవు.

Saudi Arabia Urges Pakistan to Strike Iran Riyadh Cites 2025 Defense Pact

అయితే పాకిస్తాన్‌లో 30 నుండి 50 మిలియన్ల షియా జనాభా ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్దది. ఇరాన్‌పై దాడి చేస్తే ఇది దేశంలో తీవ్ర అశాంతికి దారి తీయవచ్చు. అలాగే ఇప్పటికే దారుణంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారుస్తుంది. పెరుగుతున్న చమురు ధరలు, గల్ఫ్ నుండి తగ్గిన ఆదాయాలు, ప్రస్తుత ఆర్థిక, ఇంధన పరిస్థితి సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తాయి. భద్రతాపరంగానూ ఆందోళనలున్నాయి. అలాగే ఇరాన్ తో 900 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న పాకిస్తాన్ కు కొత్త సవాళ్లు విసరవచ్చు. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ ఇరాన్ పై పూర్తిస్థాయి దాడికి దిగడం లేదా సైన్యాన్ని పంపడం అసంభవం అని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+