వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిల్లీ: కారు డోర్ వేయలేదని భార్యకు విడాకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

రియాద్: కారు డోర్ వేయడానికి నిరాకరించిందనే కోపంతో సౌదీకి చెందిన ఓ వ్యక్తి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ సంఘటన గురువారం మీడియాలో వచ్చింది. దంపతులు పిక్నిక్ వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. భార్య కారు దిగి పిల్లలను కూడూ తీసుకుని ఇంట్లోకి వెళ్లిందని అరబ్ న్యూస్ రాసింది.

భార్యను భర్త బయటకు పిలిచాడు. కారు డోర్ వేయాలని చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. పైగా దగ్గరే ఉన్నావు కాబట్టి నువ్వే వేసుకో అని కూడా చెప్పింది. దాంతో అతను ఆమెతో తగాదాకు దిగాడు. కారు డోర్ వేయకపోతే నువ్వు నా ఇంట్లోకి రావద్దని ఆమెకు చెప్పాడు.

Saudi man divorces wife for not closing car door

దాంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లి తండ్రి ఇంటికి వచ్చేసింది. వారికి సర్దిచెప్పడానికి చాలా మంది ప్రయత్నించారు. అయితే, భార్య తిరిగి భర్త వద్దకు వెళ్లడానికి నిరాకరించింది. అంతటి బాధ్యతారహితమైన వ్యక్తితో తాను జీవించలేనని చెప్పేసింది.

సౌదీ అరేబియాలో 15 ఏళ్ల పైబడి వయస్సున్న వేయి మందిలో ఇద్దరి నుంచి ఐదుగురు ఇటువంటి విడాకుల కేసుల్లో ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. 2012లో 30 వేల విడాకులు జరిగాయి. అంటే సగటును రోజు 82 విడాకులు. గంటకు మూడు విడాకులన్నమాట.

English summary
A Saudi man divorced his wife because she refused to close the car door, media reported Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X