వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్గానిస్థాన్‌లో కారు బాంబు దాడి.. ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు

ఆఫ్గానిస్థాన్‌లోని సేవ్‌ ది చిల్డ్రన్‌ కార్యాలయం లక్ష్యంగా బుధవారం తాలిబన్‌ ఆత్మాహుతి దళాలు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, సుమారు 12మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కాబూల్‌: ఆఫ్గానిస్థాన్‌లోని సేవ్‌ ది చిల్డ్రన్‌ కార్యాలయం లక్ష్యంగా బుధవారం తాలిబన్‌ ఆత్మాహుతి దళాలు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, సుమారు 12మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.

ఆత్మాహుతి దళాలు కారులో పేలుడు పదార్థంతో దాడులకు పాల్పడినట్లు అధికార ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలో కార్యాలయం ప్రధాన గేటును మిలిటెంట్‌ దళాలు రాకెట్‌ ఆధారిత గ్రేనేడ్‌తో పేల్చినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.

afghan-car-bomb-attack

ఆఫ్గానిస్థాన్‌లో పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సౌకర్యాల కల్పన.. వివిధ రకాల సదుపాయాలు అందించేందుకు ఐక్యరాజ్యసమితి సారథ్యంలో ఈ సేవ్ ది చిల్డ్రన్ సంస్థను ఏర్పాటు చేశారు. 16 ప్రావిన్స్‌లలో దీని ఆధారిత ఛారిటీలు పనిచేస్తున్నాయి. సుమారు ఏడు లక్షల మంది చిన్నారులు వీటి ద్వారా లబ్ధి పొందుతున్నారు.

దాడికి సంబంధించి కార్యాలయంలోని ఉద్యోగి మాట్లాడుతూ.. 'నేను ఇద్దరు మిలిటెంట్లను చూశాను. వారు మమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు. మా కోసం ప్రార్థించండి. వెంటనే భద్రతాదళాలకు సమాచారం అందించడి..' అంటూ వాట్సప్‌లో అధికారులకు సమాచారం అందించారు.

దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. కానీ అప్పటికే దాడి మొదలవడంతో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో దట్టమైన నల్లని పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో సుమారు 50 మంది సిబ్బంది కార్యాలయంలో ఉన్నారు. దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం.

ఆ దాడుల వెనుక పాక్‌ హస్తం..

ఇటీవల కాబూల్‌లోని ఓ ప్రముఖ హోటల్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో 46 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి సంబంధించిన పేలుడు పదార్థాలకు ఉపయోగించిన వాహనాలు పాకిస్తాన్‌ నుంచి వచ్చినట్లు ఆఫ్గానిస్థాన్‌ గూఢాచర సంస్థ ధ్రువీకరించింది. ఇస్లామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీ ఈ దాడులకు సంబంధించిన పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు పేర్కొంది.

English summary
Islamic State militants have stormed the office of international aid agency Save the Children in the eastern Afghan city of Jalalabad, killing at least two people and wounding 12 others. In response to the January 24 attack, the London-headquartered organization had "temporarily suspended" all its programs across Afghanistan and closed its offices, a spokesperson said in a statement. “It is with profound sadness that we can confirm three Save the Children staff members were killed earlier today in an attack on our office in Jalalabad, Afghanistan," the group said in a statement on January 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X