పెషావర్ దాడి: ఉగ్రవాదుల ఉరితీత
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని పెషావర్ ఆర్మీ స్కూల్ మీద ఉగ్రదాడి ఘటనలో నలుగురు ఉగ్రవాదులను ప్రభుత్వం ఉరి తీసింది. కోవత్ జిల్లా జైల్లో ఉన్న ఉగ్రవాదులను గుట్టుచప్పుడు కాకుండా బుధవారం వేకువ జామున అక్కడే ఉరి తీశారు.
ముజీబ్ ఉర్ రెహమాన్ అలియాస్ నజీబ్ ఉల్లా, అబ్దుల్ సలాం, సబీల్, హజ్రత్ ఆలీ అనే నలుగురిని ఉరి తీశామని అధికారులు తెలిపారు. ఈ నలుగురు ఉగ్రవాదులు తెహాద్వాల్ జీహాద్ ఉగ్రవాద గ్రూప్ (తాలిబన్)కు చెందిన వారని అధికారులు అన్నారు.
2014 డిసెంబర్ 16వ తేదిన పెషావర్ లోని ఓ ఆర్మీ స్కూల్ మీద ఉగ్రవాదులు దాడులు చేసి నరమేధం సృష్టించారు. పాక్ సైనికుల దుస్తుల్లో స్కూల్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు పిల్లలపై కాల్పులు జరిపారు.

ఈ నరమేధంలో 150 మందికి పైగా చిన్నారులు బలైనారు. అనేక మందికి తీవ్రగాయాలైనాయి. అధికారులు ఉగ్రవాదులను పట్టుకుని వివిధ అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. ఈ నలుగురు దోషులుగా గుర్తించారు.
ప్రత్యేక కోర్టు ఈ నలుగురు ఉగ్రవాదులకు ఉరి శిక్ష విధించింది. నలుగురు ఉగ్రవాదులు క్షమాభిక్ష పిటీషన్ ను పెట్టున్నారు. పాకిస్థాన్ దేశ అధ్యక్షుడు హుస్సేన్ ఆగస్టు నెలలో క్షమాభిక్ష అర్జీని తిరస్కరించారు. కోర్టు తీర్పును అమలు చేస్తూ అధికారులు బుధవారం నలుగురిని ఉరి తీశారు.












Click it and Unblock the Notifications