ఇరాన్ వరుస దాడులు: ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇరాన్-ఇజ్రాయెల్ మద్ద భీకర యుద్ధం కొనసాగుతోంది. ఒకదేశంపై మరో దేశం వరుస క్షిపణుల దాడులతో విరుచుకుపడుతోంది. ఇరాన్-మద్దతుగల మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకున్నందుకు ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడులు చేస్తోంది.
'తూర్పు నుంచి'(ఇరాన్) ప్రయోగించిన డ్రోన్ దాడిలో తమ ఇద్దరు సైనికులను ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది. పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రకారం.. దాడి ఇరాక్ నుంచి జరిగింది. ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్‌లోని స్థావరాన్ని ఇది తాకింది.

మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఈ వారం ఇజ్రాయెల్ దాడిలో మరణించిన తర్వాత హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా జ్ఞాపకార్థం శుక్రవారం ప్రార్థనలు చేశారు. అనంతరం టెహ్రాన్ గ్రాండ్ మసీదు వద్ద పెద్ద సమూహాన్ని ఉద్దేశించి ఖమేనీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను, బీరుట్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు వార్తా సంస్థ రాయిటర్స్‌కి తెలిపాయి.
లెబనీస్ రాజధాని బీరూట్‌లోని హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం గురువారం నాడు దాడి చేసింది. ఈ వారం ప్రారంభంలో జరిగిన దాడిలో మరణించిన దివంగత హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాకు వారసుడిగా విస్తృతంగా చర్చిస్తున్న సీనియర్ హిజ్బుల్లాహ్ అధికారి హషీమ్ సఫీద్దీన్‌ను తొలగించడం లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడి చేసింది.
గురువారం ఆలస్యంగా ప్రారంభించిన పది వరుస వైమానిక దాడుల్లో తొమ్మిది మంది మరణించారు. 2006 నుంచి సెంట్రల్ బీరుట్‌లో ఇది రెండవ దాడులు. సిరియా- లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ దాడి కారణంగా సిరియాకు వెళ్లడానికి లెబనాన్ నుంచి శరణార్థులు ఉపయోగించే అంతర్జాతీయ రహదారి ధ్వంసమైంది. లెబనీస్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇజ్రాయెల్ వైమానిక దాడుల భయం కారణంగా.. 3,00,000 మంది ప్రజలు లెబనాన్ నుంచి సిరియాకు పారిపోయారు.
లెబనాన్‌లో గత రోజు 28 మంది ఆరోగ్య కార్యకర్తలు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదించింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమై పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడటంతో లెబనాన్‌లో వైద్య సంరక్షణ సంక్షోభం నెలకొంది.
హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై గురువారం జరిపిన దాడుల్లో హిజ్బుల్లా నాయకుడు అనిసి, మరో 15 మందిని తొలగించినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో ఇజ్రాయెల్ వరుస బాంబు దాడుల్లో 37 మంది మరణించారు, మరో 151 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడులతో సుమారు 1000 మంది మరణించారని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications