జర్మనీలో కూలిన విమానం.. ముగ్గురి మృతి..?
జర్మనీలో ఘోర ప్రమాదం జరగింది. ప్రయాణికులతో వెళ్తున్న చిన్న విమానం కుప్పకూలింది. స్టుట్గార్ట్ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం బయల్దేరిన పైపర్ ఎయిర్‌క్రాప్ట్‌కు చెందిన విమానం ప్రమాదవశాత్తు స్టైనెన్బ్రాన్ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీస్తున్నారు.

విమాన ప్రమాదంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రమాదం జరగడానికి గల కారణం కూడా ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయి ఉంటారని పోలీసులు తెలిపారు. కడపటి సమాచారం అందేవరకు ముగ్గురు చనిపోయారని తెలుస్తోంది. టేకాఫ్ అయిన వెంటనే విమానం ప్రమాదానికి గురయ్యిందని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్లైట్ రికార్డర్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications