ఇజ్రాయెల్ పై భయానక దాడి- ఆసుపత్రి నేలమట్టం
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ఉధృతమౌతోంది. వరుసగా ఏడో రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్.. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తాజాగా ఇరాన్ తన ప్రతి దాడి తీవ్రతను పెంచింది. బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ ఉదయం ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడికి దిగింది. ఈ క్షిపణి దాడిలో బీర్షెవాలోని సోరోకా ఆసుపత్రి ధ్వంసమైంది. ఈ మిస్సైల్ నేరుగా ఆసుపత్రిపై ఢీ కొట్టింది. ఫలితంగా భవనం నేలమట్టమైంది.
నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చి బాలిస్టిక్ మిస్సైల్ నేరుగా ఆసుపత్రి భవనాన్ని తాకింది. ఆ వెంటనే పెద్ద శబ్దం చేస్తూ భవనం నేలమట్టమైంది. పలువురు పేషెంట్లు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో పాటు టెల్ అవీవ్, రమత్ గాన్, హ్యాలోన్ లల్లో కూడా క్షిపణి దాడులు సంభవించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.
టెల్ అవీవ్ దక్షిణాన ఉన్న హ్యాలోన్ లోని ఓ నివాస భవనంపై మిస్సైల్ పడటంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని వోల్ఫ్ సన్ మెడికల్ సెంటర్ తెలిపింది. రమత్ గాన్‌లో జరిగిన దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని హీబ్రూ మీడియా పేర్కొంది. 24 గంటల వ్యవధిలో ఇరాన్ తన ప్రతిదాడులను తీవ్రతరం చేసిందని, సుమారు 20 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు వివరించింది.
సొరొకా ఆసుపత్రిపై దాడి చోటు చేసుకోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ఐడీఎఫ్ పేర్కొంది. సోరోకా ఆసుపత్రిలో ప్రమాదకరమైన కెమికల్స్ లీకేజ్ ఏర్పడినట్లు ఇజ్రాయెల్ ఛానెల్ 12 తెలిపింది. ఈ అనుమానంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారని వెల్లడించింది.
We pray for the safety of the patients and the medical staff at Soroka Hospital, which just suffered a direct hit from an Iranian missile.
— Danny Danon 🇮🇱 דני דנון (@dannydanon) June 19, 2025
This is a grave violation of international law by Iran, which is launching missiles at Israeli cities with the clear intent to target… pic.twitter.com/nVCvZpUCtz
ఆసుపత్రిపై దాడి పట్ల ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ మంత్రి యూరియెల్ బుసో.. ఘాటుగా స్పందించారు. దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇరాన్ గీత దాటిందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమాయక పౌరులు, డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ ను ఇరాన్ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications