వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృంగారంపై సర్వే: బ్రిటన్ పౌరులు నెలకు 4సార్లే చేస్తారట!

|
Google Oneindia TeluguNews

Sex Uncovered: austerity-hit Britons have sex less than once a week, poll finds
లండన్: బ్రిటన్ పౌరుల్లో రోజు రోజుకు శృంగారంపై ఆసక్తి తగ్గుతోందట. అందుకే వారు నెలకు నాలుగుసార్లు మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నారట. ఈ విషయంలో ఓ సర్వేలో తేలింది. ‘ది అబ్జర్వర్' అనే పత్రిక విడుదల చేసిన సర్వేలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. 2008లో నిర్వహించిన తమ సర్వేలో నెలకు ఏడు సార్లు పాల్గొన్నట్లు తేలిందని సర్వే తేల్చింది.

నెలలో 30సార్లు శృంగారం చేసే వాళ్లు కేవలం ఒక్కశాతం మాత్రమే ఉన్నారని ఈ సర్వేలో తేలింది. కాగా, ఎన్ని సార్లు పాల్గొన్నప్పటికీ తాము మాత్రం తమ శృంగార జీవితంలో సంతోషంగానే ఉన్నామని 63శాతం మంది చెబుతున్నారు.

ఇది కూడా ఇంతకుముందు చేసిన సర్వేతో పోలిస్తే.. 13శాతం తగ్గింది. అప్పటి సర్వేలో 76శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. ఇంటర్ నెట్ ద్వారా పరిచయం అయినవారితో తాము శృంగారంలో పాల్గొన్నట్లు ప్రతి ఏడుగురిలో ఒకరు చెప్పడం గమనార్హం. ఇంకా వేశ్యల వద్దకు వెళ్లి తమ కోర్కెను తీర్చుకున్నవాళ్లు 22శాతం మంది ఉన్నారు. 2008తో పోల్చితే ఇది 4శాతం పెరిగింది.

ఆన్‍‌లైన్‍‌లో 76శాతం మంది పురుషులు పోర్నోగ్రఫీ గురించి చదవితే, 53శాతం మంది మహిళలు ఎరోటికా గురించి చదివినట్లు తేలింది. తమకు 16ఏళ్లు వచ్చేలోపే కన్యత్వాన్ని కోల్పోయామని ప్రతి ఐదుగురు యువతుల్లో ఒకరు చెప్పారు. అంతేగాక, సగటున ప్రతి బ్రిటన్ పౌరుడికి పదిమంది శృంగార భాగస్వాములు ఉన్నారని సర్వే వెల్లడించింది. ఇది 2008తో పోల్చితే స్వల్పంగా పెరిగిందని తెలిపింది.

English summary

 Britain is losing its libido. That is the striking conclusion of an Observer survey – published in the new Sex Uncovered supplement – which reveals that the average British adult has sex only four times a month, less than once a week. Our previous survey, in 2008, recorded a figure of seven times a month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X