వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్సువల్ హెల్త్: 'నేను సెక్స్ చేస్తున్నానని మా అమ్మకు చెప్పలేను... జాగ్రత్తగా ఎలా ఉండాలో నాకు తెలుసు'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సెక్సువల్ హెల్త్

సింగపూర్‌లో ఉంటున్న నాడియా మూడేళ్ల క్రితం లైంగిక వ్యాధి ఉందేమోనని పరీక్ష చేయించుకోడానికి ఒక స్థానిక క్లినిక్‌కు వెళ్లినపుడు డాక్టర్ ముందు సిగ్గుతో తలదించుకున్నారు.

24 ఏళ్ల ఆ విద్యార్థిని, అక్కడ తనను 'నీకు తెలివిలేదా' అన్నట్లు చూసిన, ఒక మధ్య వయసు మహిళా డాక్టర్... కొన్ని పాంప్లెట్లను చేతిలోపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

"ఆ ఇన్ఫెక్షన్ రావడం నా తప్పే అన్నట్లు, నా బాయ్‌ఫ్రెండుతో సెక్స్ చేయకపోయుంటే అది నాకు అసలు వచ్చుండదుగా అని ఆమె నన్ను దెప్పిపొడుస్తున్నట్టు అనిపించింది" అన్నారు.

కానీ, ఇప్పుడు, దేశంలో ఇంటర్నెట్ అవగాహన ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఆప్షన్స్ లభిస్తున్నాయి. కొత్తగా వస్తున్న ఎన్నో టెలీ-హెల్త్ స్టార్టప్స్ పుణ్యమా అని.. అందరూ ఇప్పుడు లైంగిక ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు.

నాడియా లాంటి వారు ఏమాత్రం సిగ్గు పడకుండా తమకు అవసరమైన లైంగిక ఆరోగ్య ఉత్పత్తులు, సలహాలను పొందడానికి అవి సహాయ పడుతున్నాయి.

తను ఇప్పుడు లైంగిక వ్యాధులు ఉన్నాయేమో తెలుసుకోడానికి మన ఇంట్లోనే పరీక్ష చేసుకోడానికి వీలుగా పెర్న్ హెల్త్ కంపెనీ అందిస్తున్న ఎస్టీఐ పరీక్షల కిట్‌ను ఉపయోగిస్తున్నట్లు నాడియా చెప్పారు.

వెబ్‌సైట్‌లో వీడియో కాల్ ద్వారా డాక్టరును సంప్రదించాక, ఆమెకు జాగ్రత్తగా ప్యాక్ చేసిన ఒక వజైనల్ స్వాబ్ కిట్ వచ్చింది.

దానితో ఆమె స్వయంగా తన శాంపిల్స్ తీశారు. తర్వాత రోజు వచ్చిన ఒక కొరియర్ వారు వాటిని తీసుకెళ్లారు. వారం లోపే ఆమెకు ఫలితాలు కూడా అందాయి.

"ఆ బాక్స్ మీద ఏదీ రాయలేదు. లోపల ఏముందనేది కొరియర్ వాళ్లకు కూడా తెలీదు. అది చాలా బాగా అనిపించింది" అన్నారు నాడియా.

ఆమె తన తల్లిదండ్రులు, ఇద్దరు తోబుట్టువులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.

"మా కుటుంబం చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. నేను సింగపూర్ వాసిని, మలై ముస్లింను కూడా. అందుకే మన నుంచి ఇంట్లోవాళ్లు కొన్ని ఆశిస్తారు. నేను సెక్స్ చేస్తున్నాననే విషయం మా అమ్మతో చెప్పలేను".

గర్భ నిరోధక మాత్రలు

ఏకైక మార్గం ఇదే

మరోవైపు యూరప్, అమెరికాలో ఇంట్లోనే ఎస్‌టీఐ పరీక్షలు చేసుకోవడం అనేది మామూలు విషయం. అదే, సింగపూర్‌ విషయానికి వస్తే ఇది కొత్త.

ఇలాంటి సేవలు చాలా అవసరమేనని నిపుణులు, వినియోగదారులు అంటున్నారు.

కానీ, "అలాంటి పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు కొన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది" అని క్లినికల్ సెక్సాలజిస్ట్ మార్ లీ చెబుతున్నారు.

ఇళ్లలో చేసుకునే టెస్ట్ కిట్స్ ఫలితాల్లోవాటిని ఉపయోగించే పరిస్థితులు, విధానాలను బట్టి తప్పుగా పాజిటివ్ రావచ్చు

మీరు టెస్ట్ చేసుకుంటున్న పరిసరాలు శుభ్రంగా లేకపోయినా, స్వాబ్‌తో శాంపిల్ సరిగా తీయలేకపోయినా ఆ ఫలితాలపై ప్రభావం పడవచ్చు. తప్పుగా వచ్చే ఫలితాల వల్ల ఇబ్బందులతోపాటూ సరైన చికిత్స పొందడం ఆలస్యం అయ్యేలా చేస్తాయి.

అయితే, లైంగిక ఆరోగ్యం గురించి విశ్వసనీయ సలహాలు, సమాచారం పొందాలనుకునే చాలామంది సింగపూర్ యువతకు ఈ సేవలు ఇప్పుడు ఒకే ఒక ఆప్షన్‌ అయ్యాయి.

ఈ హెల్త్ సేవలను పొందుతున్నవారు వాటిని ఆస్వాదిస్తున్నారు. గంటల తరబడి ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా సమయాన్ని ఆదా చేస్తున్నాయని అంటున్నారు.

అయితే వీటి వల్ల ఎలాంటి సూటి పోటు మాటలు, అవమానాలు ఉండవు అనే విచక్షణానుభవమే వారిని ఇలాంటి సేవలవైపు ఆకర్షిస్తోందా.

ఆన్‌లైన్ ద్వారా ఆరోగ్య సేవలు

సిగ్గుతో చితికిపోయా

37 ఏళ్ల వెనే పురుషుల లైంగిక ఆరోగ్యంపై దృష్టి పెట్టే నోవా సేవలను వినియోగించారు. ఆయన తన శీఘ్ర స్కలన(ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్) సమస్యకు చికిత్స తీసుకున్నారు.

"తలనొప్పి వస్తే పారాసిటిమాల్ వేసుకున్నట్లు నేను పీఈకి పిల్స్ వేసుకున్నాను. అవసరమైతే మనం బయటికెళ్లి చెక్ చేయించుకోవచ్చు, కానీ మగాళ్లు తరచూ ఈ సమస్యను డాక్టర్‌కు చెప్పుకోడానికి కూడా వెనకాడతారు" అన్నారు.

ఆయన రెండేళ్ల క్రితం డాక్టరును కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో, వేనే తన పరిస్థితి గురించి చాలా భయపడిపోయారు.

"అక్కడ చాలా మంది ముందే నర్సు, డాక్టర్ నన్ను గట్టి గట్టిగా అడుగుతూ వచ్చారు. అక్కడికి అసలు నేను ఎందుకు వెళ్లాను. సిగ్గుతో చితికిపోయా" అన్నారు.

బదులుగా, నోవాలో వేనే టెలీ-కన్సల్టేషన్ తీసుకున్నారు. ఫోన్లో మాట్లాడినపుడు అది ఒక రోగిగా తనకు గౌరవం ఇచ్చినట్లు ఆయనకు అనిపించింది. ఆ సేవలు చాలా మెరుగ్గా అనిపించాయి.

"ఎందుకంటే నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాననేది నిజానికి ప్రపంచమంతా తెలియాల్సిన అవసరం లేదు" అంటారు వేనే.

కండోమ్స్

చాలా ఇబ్బందికరమైన ప్రక్రియ

ఫిబ్రవరిలో విడుదలైన వరల్డ్ వాల్యూస్ సర్వే తాజా ఎడిషన్ వివరాల ప్రకారం సింగపూర్ వాసులు సెక్స్ విషయంలో చాలావరకూ సంప్రదాయవాదులుగా ఉన్నారు.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 67.3 శాతం మంది 'కాజువల్ సెక్స్' అసలు వద్దని లేదా అరుదుగా జరగచ్చని చెప్పారు.

పెళ్లికి ముందు అలాంటివి ఉండకూడదని సింగపూర్ స్కూళ్లలో బోధిస్తున్నారు. విద్యార్థులు తమ విలువలను పెంచుకోడానికి సహకరించేలా ఒక సెక్స్ ఎడ్యుకేషన్ డిజైన్ చేశారు.

"సమాజంలోని ప్రదాన విభాగం కుటుంబమే" అని ఆ దేశ విద్యా శాఖ కూడా తమ వెబ్‌సైట్‌లో చెబుతోంది.

పెళ్లి కాకుండానే లైంగిక ఆరోగ్య ఉత్పత్తుల కోస లేదా పరీక్షల కోసం కాలనీలో ఉన్న డాక్టర్ దగ్గరికెళ్లడం చాలా ఇబ్బందికరమైన ప్రక్రియ అని బీబీసీతో మాట్లాడిన కొందరు చెప్పారు.

ముఖ్యంగా ఇది మహిళలకు సమస్యగా ఉంది. మగాళ్లకు కండోమ్స్ లాంటివి మెడికల్ షాపుల్లో, మిగతా దుకాణాల్లో సులభంగా దొరుకుతుంటే.. ఆడవాళ్లు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేనిదే గర్భనిరోధక మాత్రలు కూడా తీసుకోలేకపోతున్నారు.

అందుకే డియర్ డాక్, నోవా లాంటి కంపెనీల ఇలాంటి ఆరోగ్య సేవలు స్వాగతించదగినవి. ఇలాంటి సంస్థలు లైసెన్స్ ఉన్న డాక్టర్ల ద్వారా విర్చువల్ కన్సల్టేషన్స్ అందిస్తున్నాయి.

ఈ స్టార్టప్స్ తాము భర్తీ చేస్తున్న మార్కెట్లో ఖాళీని కచ్చితంగా చూస్తున్నాయి. వాటి సేవలకు పెరుగుతున్న డిమాండ్ దానిని నిరూపిస్తోంది.

జూన్‌లో తన కంపెనీని లాంచ్ చేసినప్పటి నుంచి, దాని నెలవారీ వృద్ధి 50 శాతం కంటే ఎక్కువే అయ్యిందని నోవా ఫౌండర్ షాన్ చెప్పారు.

మరోవైపు ఫెర్న్ హెల్త్‌కు చెందిన షీ లియూ సెప్టెంబర్‌లో అది ప్రారంభించినప్పటి నుంచి వారం వారం వృద్ధి చెందుతున్నట్లు తెలిపారు.

యువత ఇప్పుడు తమ లైంగిక ఆరోగ్యంపై మరింత జాగ్రత్తగా ఉన్నారు. అడ్డంకులు ఎదురవుతున్నా బాధ్యతాయుతంగా ఉండడానికి దారుల కోసం చూస్తున్నారని స్థానిక టీనేజ్ ప్రెగ్నెన్సీ సపోర్ట సర్వీస్ బేబ్స్ చెప్పింది.

"వాళ్లు సెక్స్ గురించి అడగాలని కూడా కోరుకుంటారు. కానీ తాము తగినంత సురక్షిత పరిస్థితుల్లో ఉన్నామనేది తెలుసుకున్నాకే అలా అడుగుతారు. ప్రత్యేకంగా లైంగిక ఆరోగ్యంపై సేవలు అందిస్తున్న ఈ డిజిటల్ హెల్త్ స్టార్టప్స్ ఒక మంచి వేదిక కాగలవు" అని తెలిపింది.

కుటుంబంలో కట్టుబాట్లు ఉన్నా, ఒక కొత్త బంధంలో పడిన తర్వాత క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం ఎంత ముఖ్యం అనేది తనకు తెలుసని నాడియా కూడా అంగీకరిస్తున్నారు.

"నేను చేయగలిగే ఒకే ఒక బాధ్యతాయుతమైన పని అదే. అవునా?. కానీ చాలా మంది అలా చేయలేరు. ఎందుకంటే ఈ ప్రక్రియ ఇప్పటివరకూ అంత సులభంగా లేదు" అన్నారు.

(ఈ కథనంలో పేర్లు వారి కోరిక మేరకు మార్చాం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sexual Health: 'I can't tell my mom I'm having sex ... I know how to be careful'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X