వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాంఘై లాక్‌డౌన్: రోజుకు రూ.1,14,000 సంపాదిస్తున్న డెలివరీ బాయ్స్.. నిజమేనా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
డెలివరీ రైడర్

కొన్ని వారాలుగా లాక్ డౌన్ లో ఉన్న షాంఘై ప్రజలు నిత్యావసరాలు, ఇతర సరుకుల సరఫరా కోసం డెలివరీ యాప్ ల పైనే ఆధారపడుతున్నారు. ఈ డెలివరీలు చేస్తూ జీవనం సాగించే సుమారు 20,000 మంది కార్మికులు మాత్రం తల దాచుకునేందుకు నీడ, భద్రత లేక బాధపడుతున్నారు.

ఇద్దరు డెలివరీ సిబ్బంది బీబీసీతో తమ కథలను పంచుకున్నారు.

నేను చాలా బిజీగా ఉంటాను. చాలా మందికి చాలా అవసరాలుంటాయి. రోజంతా సరుకుల డెలివరీ చేస్తాను. అర్ధరాత్రి అవుతుండగా నేను నిద్రపోయేందుకు స్థలం కోసం వెతుక్కుంటూ ఉంటాను.

నేను ఏప్రిల్ 08న ఇల్లు వదిలి బయటకు వచ్చాను. ఇప్పటి వరకు వెనక్కి తిరిగి వెళ్ళలేదు. డెలివరీ సిబ్బంది తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి వెనక్కి వెళ్లేందుకు అనుమతిని ఇస్తోంది. కానీ, అపార్ట్మెంట్ సభ్యులు మాత్రం తమ సొంత నియమాలను రూపొందించుకుని డెలివరీ సిబ్బంది గా పని చేసే అపార్ట్మెంట్ వాసులను వెనక్కి రానివ్వడం లేదు. ఇలాంటి వారి కోసం కొన్ని హోటళ్లు ఉన్నాయి. కానీ, అందులో చాలా హోటళ్లు మాకు ఉండేందుకు అనుమతి ఇవ్వడం లేదు.

మా ఇంటి ముందు ఒక టెంట్ ఉంది. ఆ టెంట్లను కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

నేను ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు మా కాంపౌండు మేనేజర్లు వారిళ్లకు కావల్సిన సరుకులను తెచ్చి పెట్టమని అడిగారు. అందుకు బదులుగా ఆ టెంట్ లో పడుకునే అవకాశాన్నిచ్చారు. నా వస్తువులన్నిటినీ టెంట్‌లో పెట్టుకున్నాను.

కానీ, ఒక రోజు అకస్మాత్తుగా ఆ టెంటును తొలగించారు. నా వస్తువులేవీ దొరకలేదు. అక్కడుండే మేనేజర్లు ఈ విషయంతో తమకు సంబంధం లేదన్నారు. సెక్యూరిటీ గార్డులు నా వస్తువులు ఏమయ్యాయో తెలియదన్నారు.

దాంతో, నేను మరో కొత్త ప్రదేశాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. బ్రిడ్జి కింద పడుకోవడం మా లాంటి వారికి సాధారణంగా మారిపోయింది.

బ్రిడ్జి కింద పడుకుంటే ఎండ, వర్షం నుంచి రక్షణ లభిస్తుంది. నేను రోజంతా అలిసిపోయి ఉండటం వల్ల పడుకోగానే నిద్రపట్టేస్తుంది.

ఒక రోజు వాతావరణ సూచనలను పట్టించుకోలేదు. ఆ రోజు విపరీతంగా వర్షం పడుతోంది. బ్రిడ్జి కింద స్థలం నిండిపోయింది. ఇక ఒక డెలివరీ రైడర్లో పడుకోవాలని అనుకున్నాను. ఆ గది చుట్టుపక్కల ఎవరూ లేరు. పడుకోవడానికి బాగుంది. అయితే, పోలీసులు వచ్చి నన్ను అక్కడ నుంచి తరిమి కొట్టకుండా ఉంటే బాగుంటుందని ఆశించాను.

కానీ, రెండు రోజుల తర్వాత తెల్లవారుజామున రెండు గంటలకు పోలీసులు నన్ను చూసి అక్కడ నుంచి తరిమేశారు.

నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన స్థావరానికి వెళ్ళమని సూచించారు. కానీ, అది కూడా తెరిచి లేదు. అక్కడ కనీసం సెక్యూరిటీ గార్డులు కూడా లేరు.

మొదట్లో నేను కేవలం ఇన్స్టంట్ నూడుల్స్ తిని బతికేసేవాడిని. ఆ తర్వాత కొంత మంది డెలివరీ సిబ్బంది రహస్యంగా తెరిచిన ఒక రెస్టారంట్‌ను కనిపెట్టారు. ప్రస్తుతం మేం అదే రెస్టారంట్‌కు వెళ్లి టేక్ అవే ఫుడ్ కొనుక్కుంటున్నాం. పోలీసులు సాధారణంగా ఇలాంటి వాటి గురించి పట్టించుకోరు. మాకు కూడా తినేందుకు ఒక ప్రదేశం ఉండాలి కదా. కొన్ని షాపుల బయట చార్జింగ్ కోసం సాకెట్లు ఉంటాయి. అలాంటి చోట్లకు వెళ్లి ఫోన్లు చార్జింగ్ చేసుకుంటూ ఉంటాం.

వీధిలో ప్రమాదం జరిగి ఒక డెలివరీ సిబ్బంది మరణించినట్లు కూడా వార్తలు వినిపించాయి. నాకు కూడా అలాగే అవుతుందేమోననే భయం వెంటాడుతూ ఉంటుంది. కానీ, నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను సాధారణంగా నెమ్మదిగానే డ్రైవ్ చేస్తాను. ఎక్కడైనా మారు మూల ప్రాంతంలో నాకేదైనా ప్రమాదం జరిగితే అనే ఊహ చాలా భయానకంగా ఉంటుంది.

స్కూటర్ ఆగిపోయి, రిపేర్ చేసేందుకు అవకాశం లేకపోతే కూడా పెద్ద సమస్యే. స్కూటర్ లేకపోతే మొత్తం పని ఆగిపోతుంది.

డెలివరీ సిబ్బంది రోజుకు 10,000 యువాన్లు (సుమారు రూ. 1,14,000) సంపాదిస్తారనే వార్తలొచ్చాయి. అప్పటి నుంచి డెలివరీ రైడర్ల ఉద్యోగం సంపాదించడం ఎలా అని చాలా మంది అడుగుతున్నారు. నేను మాత్రం "డెలివరీ రైడర్ గా మారొద్దు" అని సలహా ఇస్తూ ఉంటాను.

షాంఘై లో మాకు మంచి ఆదాయమే వస్తుంది. కానీ, కొంత మంది రైడర్లు కేవలం కొన్ని వందల యువాన్లను మాత్రమే సంపాదించుకోగల్గుతారు. ఈ కష్టాన్ని, పరిస్థితులను అందరూ తట్టుకోగలరని నేననుకోవడం లేదు.

మేమీ పని చేయకపోతే, మాకు వేరే ఆదాయం ఉండదు. అది మరింత ఒత్తిడిని కలుగచేస్తుంది.

డెలివరీ రైడర్

'ఫీజు కట్టలేక యూనివర్శిటీలో చేరలేదు.. ఇప్పుడు రోజుకు రూ.11 వేలు సంపాదిస్తున్నా’

నేను 1999లో ఎన్‌వాయి ప్రావిన్స్‌లో జన్మించాను. నేను హైస్కూల్ చదువు పూర్తయ్యాక మంచి యూనివర్సిటీలో చేరలేకపోయాను.

నా కుటుంబం యూనివర్సిటీ ఫీజు కట్టే స్థితిలో లేదు. నేనప్పటికి చాలా చిన్న వాడిని. ఏమి చేయాలో అర్ధం కాలేదు.

అప్పుడు షాంఘై లో ఉన్న మా కజిన్ దగ్గరకు వెళ్ళమని మా అమ్మ సూచించారు.

కనీసం పడుకోవడానికి ఒక స్థలం, తినేందుకు తిండి దొరుకుతుందని భావించాం.

నేను షాంఘై వచ్చి మా కజిన్ తో కలిసి కంప్యూటర్లు అమ్మే వ్యాపారం చేసేవాడిని. అలా రెండేళ్లు గడిచింది.

కోవిడ్ లో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. దాంతో, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కోవడం మొదలుపెట్టాను. నేను మరొక డెలివరీ రైడర్‌తో కలిసి అద్దెకు ఉండేవాడిని. ఆయన బాగా సంపాదిస్తున్నాడనిపించేది. నేను కూడా రైడర్ అయ్యేందుకు సహాయం చేస్తారా అని ఆయనను అడిగాను. నేను ఈ పని మొదలుపెట్టి ఒక ఆరు నెలలు అవుతోంది.

షాంఘై అభివృద్ధి చెందిన నగరం అని అంటారు. ప్రస్తుతం నా కుటుంబం కూడా ఇంటికి వెళ్ళమని చెబుతోంది. ఇక్కడి పరిస్థితి గురించి వారు విన్నారు. షాంఘైలో కూడా ప్రజలు పస్తులుంటున్నారంటే ఊహించలేకపోతున్నాం.

అలా అని నేనేమి ఆకలి దప్పులతో ఉండటం లేదు. నేను పల్లెటూరు నుంచి వచ్చాను. చిన్నప్పుడు పశువుల పాకలో కూడా పడుకున్నాను. నేను బాగానే ఉంటాను.

నేను ప్రతీ ఆర్డర్ కు సగటున 4.5 యువాన్లను (సుమారు రూ. 52) సంపాదిస్తాను. అయితే, ఈ ఆర్డర్ లు తీసుకోవడం మానేసాను. దీని వల్ల వచ్చే డబ్బులు చాలా తక్కువ. ఈ మధ్య నేను చాట్ గ్రూపుల ద్వారా క్లయింట్ల నుంచి ప్రైవేటు ఆర్దర్లు తీసుకుంటున్నాను. నేను రోజుకు 1000 యువాన్లు (సుమారు రూ. 11,000) సంపాదిస్తున్నాను.

పెద్ద పెద్ద అపార్టుమెంట్లలో అందరూ కలిసి ఆహార పదార్ధాలను సామూహికంగా కొంటున్నారు. కానీ, తక్కువ కుటుంబాలు నివసించే చిన్న చిన్న అపార్టుమెంట్లలో ఇటువంటి సౌలభ్యం ఉండటం లేదు. అలాంటి వాళ్లకు సరుకులు సప్లై చేయాలంటే కష్టంగా ఉంటోంది. సరుకులు ఆర్డర్ చేయడం కూడా కష్టంగానే ఉంటోంది.

తక్కువ సరుకు కోసం చేసే ఆర్డర్లను స్వీకరించడం లేదు. పండ్ల దుకాణాలు పండ్లను విడిగా అమ్మడం లేదు. ఎక్కువ మొత్తంలో కొనుక్కోవాల్సి వస్తోంది. ఎవరికైనా 20 యువాన్ల (రూ. 230) విలువ చేసే కూరగాయలు కావాలంటే కనీసం ఒక పూట ఎదురు చూడాల్సి వస్తోంది. అంత సేపు ఎదురు చూసిన తర్వాత కూడా దొరకటం లేదు. కూరగాయలు కూడా పెద్ద మొత్తంలోనే లభిస్తున్నాయి. అవి 100 యువాన్లు (సుమారు రూ. 1,157) ఉంటున్నాయి.

షాంఘైలో చాలా మంది పెద్ద మొత్తంలో ఆహార పదార్ధాలను కొనుక్కుంటున్నారు.

షాంఘైలో చాలా మంది పెద్ద మొత్తంలో ఆహార పదార్ధాలను కొనుక్కుంటున్నారు. వాటిని తెలిసిన వారితో కలిసి పంచుకుంటున్నారు.

ప్రస్తుతానికి మాకు తినడానికి తిండి, తాగేందుకు నీరు దొరకడం లేదు. వీధుల్లో పడుకుంటున్నాం. నా లాంటి పరిస్థితుల్లో కనీసం 40 మంది ఉన్నారు. కొంత మందికి పని చేసే సంస్థలే హోటల్ గదులను ఇస్తున్నాయి. కొంత మంది మా లాంటి వాళ్ళు కస్టమర్ల నుంచి ఆన్‍‌లైన్ ఆర్డర్లు తీసుకుంటున్నాం. మా లాంటి వాళ్ళ వసతి కోసం స్థానిక ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదు.

నేనుంటున్న కాంపౌండ్ యాజమాన్యం నన్ను లోపలకు రానివ్వరు. నేను వైరస్‌ను మోసుకుని వస్తానేమోనని అంటారు.

నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చినా ఇంటికి వెళ్ళలేను. నేను కోవిడ్ పరీక్షల కోసం ఆస్పత్రుల కోసం వెళుతున్నాను. నాకు కోవిడ్ వస్తుందేమోనని భయంగా ఉంది. నాలాగే మిగిలిన రైడర్లకు కూడా ఇదే భయం ఉంది.

దీంతో, నేను నిద్రపోయేందుకు ఒక చిన్న స్థలాన్ని చూసుకుంటూ ఉంటాను. నా పాదాల నుంచి చాలా దుర్వాసన వస్తూ ఉంటుంది. దూరం నుంచే వాసన తెలుస్తూ ఉంటుంది. లాక్‌డౌన్ సడలించిన తర్వాత నేను స్నానం చేస్తాను.

ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోవడం వల్ల ఏం ఉపయోగముంది? లాక్‌డౌన్ విధించిన మొదటి వారంలో నాకు రెండు కేబేజీలు మాత్రమే దొరికాయి. రెండవ వారంలో ఒక చిన్న బాక్స్‌తో ఔషధాలు లభించాయి. వీటితో ఎలా బ్రతకగలం? నేనేమి తినాలి? బయట ఉండటమే మేలు. ఏదో ఒకటి తినేందుకు దొరుకుతుంది.

ఒక ఫ్యాక్టరీలో పని చేయడం కన్నా ఫుడ్ డెలివరీ చేయడం ఉత్తమం. నేను షెన్‌జెన్‌లో కొన్ని ఫ్యాక్టరీల్లో పని చేశాను. రోజుకు 12 గంటలు పని చేస్తే కేవలం 200 యువాన్లు (సుమారు రూ. 2300) వచ్చేవి. డెలివరీ రైడర్లకు స్వేచ్ఛ, ఆదాయం కూడా ఉంటుంది.

మీరెంత కష్టపడితే అంత ఆదాయం లభిస్తుంది.

నా కుటుంబం నన్ను వెనక్కి వచేయమంటోంది. కానీ, ఇప్పుడు నేనెలా బయటపడతాను? హై వే వరకు వెళ్లిన వారిని కూడా వెనక్కి పంపేశారు.

ఈ లాక్ డౌన్ ఎప్పుడు సడలిస్తారా అని ఆలోచిస్తున్నాను. నేనప్పుడు ఊరు వెళతాను. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండగలనో నాకర్ధం కావడం లేదు.

షాంఘై అంటే విసుగు వచ్చేసింది. ఒక్కసారి వదిలిపెట్టి వెళ్ళాక వెనక్కి తిరిగి రాను.

ఎడిటింగ్: టెస్సా వాంగ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Shanghai lockdown: Delivery boys earning Rs 1,14,000 a day is it true
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X