"భారత్ ను ఓడిస్తా.. లేదా పేరు మార్చుకుంటా"

ఓ పక్క తీవ్ర ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదం, ఉగ్రవాదం సమస్యలతో పాకిస్థాన్ అట్టుడికిపోతుంటే.. ఆ దేశ ప్రధాని మాత్రం భారత్ పై షాకింగ్ కామెంట్స్ చేసి మరోసారి నవ్వుల పాలయ్యారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్ పై వింత వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో తాను భారత్ ను ఓడిస్తానని వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని డేరా ఘాజీఖాన్‌ను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా సందర్శించారు.ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో షెహబాజ్ షరీఫ్ ప్రసంగించారు. సభకు వచ్చిన ప్రేక్షకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

Shehbaz Sharif s Shocking Statement We Will Defeat India in Economy and Development

"పాకిస్థాన్ లో ప్రస్తుతం ఉన్న సమస్యను అధిగమించేందుకు మనం పగలు రాత్రిళ్లు కష్టపడాలి. అదృష్టం ఎల్లప్పుడూ మనవైపే ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భారత్ ను వెనక్కు నెట్టి పాకిస్థాన్ ను ముందు వరుసలో పెట్టకపోతే నా పేరు మార్చుకుంటా. మనందరం కలిసికట్టుగా పోరాడి భారత్ ను ఓడిద్దాం " అని కీలక వ్యాఖ్యలు చేశారు. తన అన్న, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చూపించిన మార్గంలో తాను పయనిస్తున్నానని చెప్పారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు షెహబాజ్ షరీఫ్ ప్రవర్తనపై మండిపడుతున్నారు. అనేకమంది ఎక్స్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ ఇలాంటి వాగ్దానాలు చేస్తారని.. కానీ ముందుకెళ్లరని సెటైర్లు వేస్తున్నారు.భారత్‌ను ఓడించే సామర్థ్యం పాకిస్థాన్ కు లేదని.. షెహబాజ్ షరీఫ్ పేరు మార్చుకోవడం పక్కా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+