దుబాయ్ రాజకుమారుడి హఠాన్మరణం
దుబాయ్: దుబాయ్ రాజకురుడు హఠాన్మరణం చెందాడు. రాజుగారి పెద్ద కుమారుడు షేక్ రషీద్ బిన్ మోహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ (33) మరణించాడని దుబాయ్ అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి.
శనివారం ఉదయం షేక్ రషీద్ కు గుండెపోటు రావడంతో మరణించారు. షేక్ రషీద్ అనేక క్రీడలలో ప్రావీణ్యం పోందాడని దుబాయ్ అధికారిక వర్గాలు అంటున్నాయి. శనివారం షేక్ రషీద్ అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఎర్పాట్లు చేశారు.

దుబాయ్ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ పెద్ద కుమారుడు ఈ షేక్ రషీద్. దుబాయ్ లో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. రాజు కుమారుడి ఆకస్మిక మరణం పట్ల పలు దేశాల నాయకులు విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications