సూయిజ్‌లో ఇరుక్కుపోయిన అతిపెద్ద నౌక... 150 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి... మూడు రోజులుగా శ్రమిస్తున్నా...
ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల్లో ఒకటైన 'ఎంవీ ఎవర్ గివెన్' నౌక ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయింది. భారీ కంటైనర్‌తో కూడిన నౌక కాలువకు అడ్డంగా నిలిచిపోవడంతో ఇతర నౌకల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మంగళవారం(మార్చి 23) ఉదయం ఈ ఘటన చోటు చేసుకోగా... గత మూడు రోజులుగా ఆ నౌకను పక్కకు తప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదని,చాలా రోజుల సమయం పట్టవచ్చునని అక్కడి మీడియా వెల్లడించింది.

150 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి...
400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పు గల ఎంవీ ఎవర్ గివెన్ నౌక 2.20 లక్షల టన్నుల లోడ్‌తో ప్రయాణిస్తూ... సూయాజ్ కాలువలో చిక్కుకుపోయింది. ఈ నౌక నాలుగు ఫుట్‌బాల్ పిచ్‌ల అంత పెద్దగా ఉంటుంది. బలమైన ఈదురు గాలుల ప్రభావంతో నౌక తూర్పు పైభాగం కెనాల్ తూర్పు గోడను, కింది భాగం కెనాల్ పశ్చిమ గోడను తాకి అందులోనే ఇరుక్కుపోయినట్లు చెప్తున్నారు. 1869లో ఈ కెనాల్ ప్రారంభమవగా... 150 ఏళ్ల చరిత్రలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి అని చెప్తున్నారు.

ఈ ఒక్క కాలువ పైనే 12శాతం వాణిజ్యం...
ప్రపంచ వాణిజ్యంలో సూయిజ్ కాలువకు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం వాణిజ్యంలో ఈ కెనాల్ ఆధారంగా 12శాతం వాణిజ్యం జరుగుతోంది. ఈ కెనాల్ మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతుంది. ఎవర్ గివెన్ నౌక ఇప్పుడీ కెనాల్‌లో చిక్కుకుపోవడంతో... ఈ మార్గంలో ప్రయాణించాల్సిన 150 నౌకల రాకపోకలు స్తంభించిపోయాయి. ఇందులో ఆయిల్,గ్యాస్ ట్యాంకర్లతో వెళ్తున్న నౌకలు,ధాన్యం సరఫరా చేస్తున్న నౌకలు ఉన్నాయి. ఎవర్ గివెన్ నౌకను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నాల్లో భాగంగా... దాని వెనుక నిలిచిపోయిన నౌకలను ఇప్పటికే తిప్పి పంపించారు.
ఆన్‌లైన్‌లో ట్రోల్స్....
నౌకను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నాల్లో భాగంగా దాని కింద ఉన్న ఇసుకను తవ్వుతున్నారు. ఇందుకోసం ఒక ఎక్స్కవేటర్‌ను ఉపయోగిస్తున్నారు. నౌక పరిమాణం ముందు బుల్లి పిట్ట సైజులో ఉన్న ఆ జేసీబీని చూసి చాలామంది నెటిజన్లు ట్విట్టర్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. కాగా,1869 నుంచి ఇప్పటివరకూ ఆయిల్,గ్యాస్ రవాణాకు సూయిజ్ కాలువ ప్రధాన మార్గంగా ఉంది. 2015లో దీన్ని మరింత పొడగించి భారీ నౌకల రాకపోకలకు కూడా వీలు కల్పించారు. అయినప్పటికీ ఎవర్ గివెన్ నౌక ఇప్పుడిలా సూయిజ్ కాలువలో ఇరుక్కుపోవడం గమనార్హం.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications