• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గర్భవతి తాగిన సూపులో ఎలుక ప్రత్యక్షం...అబార్షన్ కోసం డబ్బులు ఆఫర్ చేసిన రెస్టారెంట్

|

చైనాలో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన మహిళ గ్జియాబూ గ్జియాబూ అనే ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అది చైనాలో ప్రముఖ రెస్టారెంట్ . తన భర్తతో కలిసి సూప్ ఆర్డర్ చేసింది. సూప్‌లో చనిపోయిన ఎలుక దర్శనమివ్వడంతో షాక్‌కు గురైంది మహిళ. దీంతో విషయం పెద్దదైంది. కడుపులో బిడ్డ ఆరోగ్యం దెబ్బతిని ఉంటుందని భావించిన రెస్టారెంట్ యాజమాన్యం అబార్షన్ చేయించుకోవాలంటూ మహిళకు డబ్బులు ఇచ్చింది. దీంతో గొడవ మరింత పెద్దదిగా మారడంతో ప్రస్తుతం ఆ రెస్టారెంట్ మూతపడింది.

సూప్‌లో ఎలుక పడిందని రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి మహిళ భర్త తీసుకొచ్చాడు. కడుపులో బిడ్డ ఆరోగ్యంపై ఆందోళన చెందితే వెంటనే ఆమెకు అబార్షన్ చేయించండి అంటూ ఉచిత సలహాతో పాటు 3వేల డాలర్ల డబ్బులు కూడా యాజమాన్యం ఇచ్చింది. ఆ తర్వాత కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలాగుందో తెలుసుకునేందుకు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లినట్లు మహిళ భర్త మా చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ మరో 728 డాలర్లు చెల్లించింది రెస్టారెంట్ యాజమాన్యం

Shocking: China restaurant offers money for abortion after dead rat discovered in soup

ఈ వార్త దావణంలా పాకిపోవడంతో ఆరోగ్యశాఖ అధికారులు రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ ఎలుకలు ఉన్నట్లుగా ఎలాంటి ఆనవాలు కనిపించలేదు. అయినప్పటికీ రెస్టారెంట్‌ను పరిశుభ్రంగా ఉంచకపోవడంతో మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఇదిలా ఉంటే కస్టమర్ల సేఫ్టీనే తమకు ముఖ్యమని..ఆహార భద్రతపై తాము రాజపడబోమని వెల్లడించింది. ఇంకా ఇతరత్రా మార్పులు ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చింది. గ్జియాబూ గ్జియాబూ రెస్టారెంట్లు చైనా వ్యాప్తంగా 759 ఉన్నాయి.

ప్రముఖ హోటల్‌ సర్వ్ చేసిన సూప్‌లో ఎలుక ప్రత్యక్షమవడం ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన తర్వాత ఆ హోటల్‌కు ఎవరూ వెళ్లొద్దంటూ నెటిజెన్లు కామెంట్ చేశారు. గ్జియబూ గ్జియాబూ రెస్టారెంట్ పరిశుభ్రతమైన ఆహారానికి మారుపేరు అని ఇంతకాలం భావించాను కానీ అంతా అబద్ధమే అని తేలిపోయిందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు. కడుపులో బిడ్డకు ఏమైనా అయితే పోయిన ప్రాణాన్ని డబ్బుతో తీసుకురాగలరా అని మరికొందరు ప్రశ్నించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A popular restaurant in China has been shut down after a pregnant woman found a dead rat in her soup and claimed that restaurant staff offered her money to get an abortion if the meal affected her unborn child's health.The woman and her husband were eating at the popular chain Xiabu Xiabu on September 6 when she discovered the dead rat in the hotpot, South China Morning Post reported. The outlet in Shandong province has now been temporarily suspended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more