పాఠశాలలో దారుణం.. 8 ఏళ్ల చిన్నారిని కత్తితో పొడిచిన టీచర్
పాఠాలు చెప్పాల్సిన టీచరే.. విద్యార్ధిని కత్తితో పొడిచింది. చిన్నారి అని కనికరం లేకుండా కత్తితో దాడికి పాల్పడింది. దీంతో చిన్నారికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ షాకింగ్ ఘటన సౌత్ కొరియాలోని డేజియాన్ నగరంలో జరిగింది.
సౌత్ కొరియా డేజియన్ నగరంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఓ 8 ఏళ్ల చిన్నారిపై అదే స్కూల్ లో పనిచేస్తున్న 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు కత్తితో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆ చిన్నారికి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చి స్కూల్ సెకండ్ ఫ్లోర్ లో పడిపోయింది. చిన్నారిని.. వాళ్ల అమ్మమ్మ గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే పాప మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం అదే ఆస్పత్రిలో చిన్నారిపై దాడికి పాల్పడిన టీచర్ కూడా చికిత్స పొందుతోంది. దీంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు టీచర్ ను అరెస్ట్ చేయకుండా ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు క్యాబినెట్ మీటింగ్ లో సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి ముఖం, మెడపై తీవ్రమైన గాయాలను గుర్తించినట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. మరోవైపు ఆ టీచర్ డిప్రెషన్ కారణంగా స్కూల్ మానేసి.. గతేడాది నుంచే విధులకు వస్తోందని పోలీసుల విచారణలో తేలింది.












Click it and Unblock the Notifications