• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయుడికి మెటా షాక్: ఉద్యోగం ఇచ్చి కెనడాకు పంపి, రెండ్రోజులకే తొలగించింది

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఉద్యోగాల కోతను మొదలుపెట్టగా.. మరో దిగ్గజం ఫేస్‌బుక్ మాతృ సంస్థ దాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మెటా ఏకంగా 11,000 మందిని ఉద్యోగాల నుంచి ఇంటికి పంపింది. అయితే, ఓ భారతీయుడు తనకు ఈ సంస్థలో ఉద్యోగం వచ్చిన రెండు రోజులకే కోల్పోవడం గమనార్హం.

మెటా ఉద్యోగిగా కెనడాకు.. రెండ్రోజులకే తొలగింపు

మెటా ఉద్యోగిగా కెనడాకు.. రెండ్రోజులకే తొలగింపు

ఈ క్రమంలో రెండు రోజులకే ఉద్యోగం పోవడంతో సదరు భారతీయుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. హిమాన్షు వీ అనే ఉద్యోగి తన కొత్త మెటా ఉద్యోగం కోసం భారతదేశం నుంచి కెనడాకు వెళ్లారు. అతని లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. హిమాన్షు ఐఐటీ-ఖరగ్ పూర్‌లో చేశాడు. అంతేగాక, గతంలో గిట్ హబ్, అడోబ్, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద సంస్థల్లోనూ పనిచేశాడు.
కెనడాకు మకాం మార్చిన రెండు రోజులకే మెటా సంస్థ హిమాన్షును ఉద్యోగం నుంచి తొలగించినట్లు అతనికి స్పష్టం చేసింది. దీంతో అతని ఆవేదనకు అంతులేకుండా పోయింది. తన గోడును లింక్డ్ ఇన్‌లో పంచుకున్నాడు.

లింక్డ్‌ఇన్‌లో భారతీయుడు హిమాన్షు గోడు

లింక్డ్‌ఇన్‌లో భారతీయుడు హిమాన్షు గోడు

'నేను #మెటాలో చేరడానికి కెనడాకు మకాం మార్చాను. ఇక్కడ విధుల్లో చేరిన 2 రోజుల తర్వాత.. భారీ తొలగింపు కారణంగా నా ప్రయాణం ముగిసింది. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరి బాధను నా హృదయం అనుభవిస్తోంది' అని పేర్కొన్నాడు. ఇప్పుడేం చేయాలో తనకు తెలియడం లేదని మెటా మాజీ ఉద్యోగిగా మారిపోయిన అతడు వ్యాఖ్యానించాడు.

ఏదైనా ఉద్యోగం కావాలంటూ కెనడాలో హిమాన్షు

ఏదైనా ఉద్యోగం కావాలంటూ కెనడాలో హిమాన్షు

ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం (కెనడా లేదా ఇండియాలోనైనా) ఉంటే తనకు తెలియజేయాలని కోరుతున్నాడు. హిమాన్షు పోస్ట్‌కు అనేకమంది నెటిజన్లు స్పందిస్తూ సానుభూతి తెలిపారు. చాలా మంది అతనిని ఓదార్చారు. చాలా మంది అతనికి ఉద్యోగ అవకాశాలపై లీడ్స్ అందించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లను నియమించుకునే కంపెనీల లింక్‌లను పంచుకున్నారు.

‘మెటా'కు బుద్ధుందా? అంటూ నెటిజన్లు ఫైర్

‘మెటా'కు బుద్ధుందా? అంటూ నెటిజన్లు ఫైర్

"ఈ విషయాలు ఎలా జరుగుతాయో? 2 రోజుల తర్వాత వారిని తొలగించేందుకు ఖండాంతరాలు దాటి వెళ్లేలా చేస్తున్నామని కంపెనీకి ఎలా తెలియదు?! ఖచ్చితంగా వారి వద్ద కనీసం 'లేఆఫ్ జాబితా' సిద్ధంగా ఉంది. రెండు వారాల ముందుగానే' అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ.. " మిత్రమా నీ బాధను అర్థం చేసుకోలను. నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను. సానుకూలంగా ఉండండి. ఎక్కడో ఎవరైనా మనకు సహాయం చేస్తారు. అంతా మంచి జరుగుగాక!!'' అని చెప్పుకొచ్చాడు. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఈ బడా సంస్థలను ఉద్యోగులను బలిచేస్తున్నాయి. ఓ వైపు ట్విట్టర్, మరోవైపు మెటా సంస్థలు వరుసగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Nonsense: Indian Man Relocates To Canada For Meta Job, Laid-Off Just 2 Days Later.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X