వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఆగని గన్ కల్చర్...బార్‌లో 12 మందిని కాల్చి చంపిన దుండగుడు

|
Google Oneindia TeluguNews

అమెరికాలో మరోసారి గన్ కల్చర్ చర్చనీయాంశంగా మారింది. లాస్ ఏంజిలెస్‌లోని ఓ మ్యూజిక్ బార్‌లో తుపాకీతో ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ సమయంలో చాలామంది బార్‌లో ఉన్నారు. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే అధికారులు దుండగుడిని కాల్చి చంపేశారు.

కాలేజీ విద్యార్థుల కోసం ఈ మ్యూజిక్ బార్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. వందలాదిగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో దుండగుడు బార్ ‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపినట్లు బార్ యాజమాన్యం చెబుతోంది. కాల్పులు శబ్దం వినపడగానే పోలీసులకు బార్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దగ్గరలోని పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే దుండగుడిపై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటన అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో చోటుచేసుకుంది.

Shooting in Southern California bar: Attacker among 12 dead in the incident

ఇదిలా ఉంటే దుండగుడు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి 11గంటల ప్రాంతంలో నల్ల రంగు పిస్తోలు పట్టుకుని బార్‌లో కలియదిరిగి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మొత్తం 30 సార్లు తుపాకీతో కాల్పులు జరిపినట్లు వారు చెప్పారు. భయంతో అంతా బార్‌ను వదిలి బయటకు పారిపోయాక కూడా కాల్పుల శబ్దం వినిపించినట్లు వారు తెలిపారు. చాలామంది కాల్పులకు భయపడి బార్‌లోని బాత్రూంలో దాక్కొని ప్రాణాలు దక్కించుకున్నట్లు సాక్షులు తెలిపారు.

English summary
A gunman killed 12 people, including a deputy sheriff, when he opened fire in a bar in Southern California on Wednesday night, Ventura County Sheriff Geoff Dean said on Thursday.The suspected gunman was also shot dead by police, he said. Many other people were wounded in the attack in Thousand Oaks, a Los Angeles suburb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X