వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కుల్లో ట్రంప్‌ ప్రభుత్వం, గడువులోగా వ్యయబిల్లు ఆమోదించకుంటే కష్టమే! డెమోక్రాట్లు మద్దతిస్తారా?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకోని చిక్కులు ఎదురయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రిలోగా ట్రంప్‌ ప్రభుత్వం వ్యయ బిల్లును ఆమోదించలేకపోతే ప్రభుత్వం స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది.

అమెరికాను వణికించిన ఉల్కాపాతం! (వీడియో)అమెరికాను వణికించిన ఉల్కాపాతం! (వీడియో)

ఈలోగా రిపబ్లికన్ల నియంత్రణలోని కాంగ్రెస్‌, తాత్కాలిక అవసరాల కోసం రూపొందించిన నిధులను సమకూర్చుకునే బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్‌‌చేత ఆమోద ముద్ర వేయించే పనిలో నిమగ్నమైంది.

టెన్షన్‌లో ట్రంప్ ప్రభుత్వం...

టెన్షన్‌లో ట్రంప్ ప్రభుత్వం...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి టెన్షన్ పడుతున్నారు. దీనికి కారణం వ్యయ బిల్లు ఆమోదానికి గడువు శుక్రవారం అర్థరాత్రి వరకే ఉండడం. ఆ గడువులోగా వ్యయ బిల్లు ఆమోదానికి నోచుకోకపోతే నిధులు లేక ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవడం తథ్యం. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా తాత్కాలిక బిల్లు రూపొందించే పనిలో ఉన్నారు రిపబ్లికన్లు. అయితే ఇందులో కూడా ప్రమాదాలు లేకపోలేదు. రక్షణ వ్యయం బాగా పెంచాలని కన్జర్వేటివ్‌లు కోరుతున్నారు. తాత్కాలిక బిల్లులో అటువంటివి చేర్చే అవకాశం ఉండకపోవడం ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారింది.

డెమోక్రాట్ల మద్దతు లభిస్తుందా?

డెమోక్రాట్ల మద్దతు లభిస్తుందా?

ఇటు వ్యయబిల్లు ఆమోదంగాని, ప్రత్యామ్నాయ తాత్కాలిక బిల్లు ఆమోదానికిగాని ప్రతిపక్ష్ డెమోక్రాట్ల మద్దతు అవసరం. అయితే ఇమ్మిగ్రేషన్‌ (వలసల) విధానం పరిష్కారమైతే తప్ప ప్రభుత్వానికి మద్దతు ఇవ్వరాదని పలువురు డెమోక్రాట్లు భావిస్తున్నట్లు సమాచారం. పిల్లలుగా వున్నపుడు దేశంలోకి వచ్చిన వారిని తిరిగి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకునే దిశగా గత వారం జరిగిన చర్చలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఆ తర్వాత చర్చలు జరిపేందుకు వాతావరణం అనువుగా లేకుండా పోవడంతో డెమోక్రాట్లు ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ట్రంప్‌ దెబ్బ.. ‘గ్రీన్‌ కార్డ్' కోసం ఇక 40 ఏళ్లు ఆగాల్సిందే!ట్రంప్‌ దెబ్బ.. ‘గ్రీన్‌ కార్డ్' కోసం ఇక 40 ఏళ్లు ఆగాల్సిందే!

ట్రంప్ వ్యాఖ్యలతో మరింత ముదిరిన విభేదాలు...

ట్రంప్ వ్యాఖ్యలతో మరింత ముదిరిన విభేదాలు...

కొంతమంది సెనెటర్లు కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ట్రంప్‌ తిరస్కరించడంతో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య తలెత్తిన విభేదాలు ఆప్రికా దేశాల నుండి వచ్చే వలసలను ఉద్దేశిస్తూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించకుండా నివారించడానికి తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటనే అంశంపై ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు సమావేశం కానున్నట్లు కాంగ్రెస్‌ సభ్యులు తెలిపారు. అమెరికా సెనెట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ తక్కువగా వున్న నేపథ్యంలో ఈ పరిష్కారానికి ఆమోద ముద్ర లభించాలంటే ట్రంప్‌ పక్షానికి కొంతమంది డెమోక్రాట్ల మద్దతు కూడా అవసరం. అప్పుడే ప్రభుత్వాన్ని నడిపేందుకు ట్రంప్‌ సర్కార్‌ ఎదుర్కొంటున్న నిధుల కొరతను అధిగమించడానికి వీలు వుంటుంది.

ట్రంప్ మరో శ‌ృంగారలీల! పోర్న్‌స్టార్‌తో లైంగిక సంబంధం? ఆమె నోరు తెరవకుండా...ట్రంప్ మరో శ‌ృంగారలీల! పోర్న్‌స్టార్‌తో లైంగిక సంబంధం? ఆమె నోరు తెరవకుండా...

ఈ తాత్కాలిక చర్య నాలుగోది...

ఈ తాత్కాలిక చర్య నాలుగోది...

ప్రభుత్వ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేని రీతిలో తాత్కాలిక పరిష్కారాన్ని కనుగొన్నట్లైతే 2018 అక్టోబరు 1వ తేదీ అమెరికా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయేలోగా ఇది నాలుగోసారి తీసుకున్న తాత్కాలిక చర్య అవుతుంది. వ్యయ బిల్లును ఆమోదించడానికి అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఎంతగా పోరు సల్పుతుందో చెప్పడానికి ఇదొక సంకేతం. నిజానికి 1998 నుండి ఇటువంటి తాత్కాలిక చర్యలు సర్వ సాధారణంగా మారాయి. ఇప్పటివరకు 112సార్లు ఇలాంటి తాత్కాలిక పరిష్కార మార్గాలను అమలు చేశారని ఆర్థిక, ద్రవ్య బాధ్యతలు విశ్లేషించే పీటర్సన్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

English summary
Chances of a government shutdown grew Monday as Republicans concluded that they would be unable to reach a long-term spending accord by the Friday deadline. GOP leaders are now turning to a short-term funding measure in hopes of keeping agencies open while talks continue, but Democratic leaders say they are unlikely to support any deal that does not protect young illegal immigrants. Aides to key negotiators from both parties planned to meet Tuesday in an effort to rekindle budget talks, setting up a Wednesday meeting of the leaders themselves. If they cannot agree, the government would shut down at midnight Friday for the first time since 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X