నీ దేశం వెళ్లిపో: మాస్క్‌తో వచ్చి సిక్కు వ్యక్తిపై అమెరికాలో కాల్పులు
సియాటెల్‌లో ఓ సిక్కు వ్యక్తి పైన కాల్పులు జరిగాయి. అతను ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపే ముందు.. నీ దేశానికి నువ్వు వెళ్లిపో అని కాల్చిన వ్యక్తి హెచ్చరికలు జారీ చేశాడు.
వాషింగ్టన్: సియాటెల్‌లో ఓ సిక్కు వ్యక్తి పైన కాల్పులు జరిగాయి. అతను ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. కాల్పులు జరిపే ముందు.. నీ దేశానికి నువ్వు వెళ్లిపో అని కాల్చిన వ్యక్తి హెచ్చరికలు జారీ చేశాడు.
అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభోట్ల మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయి.

39 ఏళ్ల బాధితుడు (సిక్కు వ్యక్తి) కెంట్‌లోని ఈస్ట్ హిల్స్‌లో తన వాహనంలో వెళ్తుండగా కాల్పులు జరిగాయి.
అతను వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చాడని కెంట్ పోలీసులకు బాధితుడు చెప్పారు. ఈ దేశం వదిలి వెళ్లాలని తనతో నిందితుడు చెప్పాడని, ఆ తర్వాత కాల్చాడని చెప్పారు.
నిందితుడు 6 అడుగుల పొడవు ఉన్నాడని, మాస్క్ ధరించాడని బాధితుడు పోలీసులకు వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు కెంట్ పోలీసులు ఎఫ్‌బీఐ సహకారం కోరారు.
ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉంది. అతను ఆసుపత్రి నుంచి విడదలయ్యాడు.
రెంటాన్‌లోని సిక్కు కమ్యూనిటీ నేత జస్మీత్ సింగ్ మాట్లాడుతూ... బాధితుడు ఆందోళన చెందుతున్నాడని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనల పైన ఆందోళనగా ఉన్నట్లు తెలిపారు.
-
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications