వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత టెక్కీకి కావాలనే హెచ్‌-1బీ వీసా ఇవ్వడం లేదు: అమెరికా ప్రభుత్వాన్ని కోర్టుకు లాగిన టెక్ కంపెనీ

|
Google Oneindia TeluguNews

భారత టెక్కీకి కావాలనే హెచ్‌-1బీ వీసాను నిరాకరిస్తోందని అమెరికా ప్రభుత్వంపై సిలికాన్ వ్యాలీలోని ఓ టెక్ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. వివరాల్లోకి వెళితే.... సిలికాన్ వ్యాలీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్సెటెర్రా సొల్యూషన్స్ సంస్థ యూఎస్ సిటిజెన్‌షిప్ మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పై అక్కడి కోర్టులో ఫిర్యాదు చేసింది. భారత్‌కు చెందిన ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట అనిశెట్టి అనే 28 ఏళ్ల టెక్కీకి తమ సంస్థలో పనిచేసేందుకు నియమించుకుంది. అయితే ప్రహర్ష్ చంద్రకు హెచ్‌-1 బీ వీసా ఇవ్వకుండా కావాలనే అడ్డుకుంటోందని తన పిటిషన్‌లో పేర్కొంది. బిజినెస్ సిస్టం అనలిస్టుగా ఆయన్ను సదరు సంస్థ నియమించుకుంది.

అనిశెట్టి తరపున కంపెనీ హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేయగా దాన్ని తిరస్కరించడం జరిగింది. హెచ్-1బీ స్పెషాలిటి ఆక్యుపేషన్ కింద అనిశెట్టి దరఖాస్తు క్వాలిఫై కాలేదనే కారణాలు చూపి ఆయన వీసా దరఖాస్తును తిరస్కరిస్తోందంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది క్సెటెర్రా కంపెనీ. అయితే ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన వివరణ యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సంస్థ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే అనిశెట్టి హెచ-1బీ వీసాకు ఆమోదం తెలిపేలా ఆదేశాలు జారీ చేయాలని కాలిఫోర్నియా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టును కంపెనీ కోరింది.

Silicon valley Tech firm sues agaisnt US Govt for denying H1-B visa to Indian techie

ఇక విదేశీయులను తమ సంస్థల్లో పనిచేసేందుకు అమెరికా కంపెనీలు నియమించుకుంటాయి. అలా అమెరికాకు వెళ్లే వారికి హెచ్-1బీ వీసా తప్పనిసరిగా ఉండాలి.ప్రతి ఏటా కొన్ని వేల మందిని అమెరికా టెక్ కంపెనీలు హెచ్‌-1బీ వీసా ఆధారం చేసుకుని తమ సంస్థల్లోకి నియమించుకుంటాయి. ఎక్కువగా భారత్ చైనా నుంచే ఈ సంస్థలు టెక్కీలను రిక్రూట్ చేసుకుంటాయి. అయితే ఆ ఉద్యోగులకు అన్ని విధాల టెక్నికల్ స్కిల్స్ ఉన్నట్లు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అనిశెట్టికి ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది ఐటీలో మాస్టర్ డిగ్రీ కూడా ఉంది. డల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్ కూడా చేశాడు. ప్రస్తుతం అనిశెట్టికి డిపెండెంట్ కింద హెచ్ -4 వీసా ఉంది. హెచ్-1బీ వీసా పొందేందుకు అన్ని అర్హతలు అనిశెట్టికి ఉన్నాయని ఉద్దేశపూర్వకంగానే ఆయన వీసాను తిరస్కరిస్తున్నారని క్సెటెర్రా సొల్యూషన్స్ కంపెనీ ఆరోపిస్తోంది.

English summary
A silicon valley based company filed a complaint in a district court against the US government for denying the H1-B visa to its employee Praharsh Chandra Sai Venkata Anisetty though he is qualified for the Visa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X