కేజీ గంజాయి అక్రమ రవాణా: భారత సంతత వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్

సింగపూర్: భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది. ఈ తెల్లవారు జామున ఆయనకు మరణశిక్షను అమలు చేసింది. ఛాంగీ సెంట్రల్ జైలులో ఉరిశిక్షను అమలు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో స్వయంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నప్పటికీ.. సింగపూర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా క్షమాభిక్ష పెట్టడానికి ముందుకు రాలేదు.

ఆయన పేరు తంగరాజు సుప్పయ్య. వయస్సు 46 సంవత్సరాలు. భారత సంతతికి చెందిన వ్యక్తి. అతని పూర్వీకులు తమిళనాడుకు చెందిన వారు. ఉపాధి రీత్యా సింగపూర్‌లో స్థిరపడ్డారు. కేజీ గంజాయిని మలేసియా నుంచి సింగపూర్‌కు అక్రమంగా తరలిస్తూ 2014 ఫిబ్రవరిలో అక్కడి పోలీసులకు దొరికాడు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

Singapore has executed Thangaraju Suppaiah for conspiring to traffic cannabis

ఈ చట్టం కింద దోషిగా తేలిన వారికి మరణశిక్షను విధిస్తుంది సింగపూర్ ప్రభుత్వం. అదే శిక్షను ఇప్పుడు అమలు చేసింది. తంగరాజుపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో 2018లో సింగపూర్ న్యాయస్థానం ఆయనకు మరణశిక్షను విధించింది. ఇవ్వాళ ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది సింగపూర్ ప్రభుత్వం. మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా బదలాయించాలంటూ పలు విజ్ఞప్తులు అందాయి.

క్షమాభిక్ష ప్రసాదించాలంటూ కుటుంబ సభ్యులు అక్కడి విజ్ఞప్తి చేశారు. మరణశిక్ష వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు ఆందోళనలు సైతం లేవనెత్తారు. ఐక్యరాజ్య సమితి సైతం జోక్యం చేసుకుంది. తంగరాజుకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని సింగపూర్ ప్రభుత్వానికి సూచించింది. అయినప్పటికీ పట్టించుకోలేదు. ఈ తెల్లవారు జామున ఛాంగీ జైలులో ఉరి శిక్షను అమలు చేసింది.

ఈ విషయాన్ని తంగరాజు చెల్లెలు లీలావతి సుప్పయ్య నిర్ధారించారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా సింగపూర్‌కు తరలిస్తూ దొరికిన 11 మంది గత ఏడాది ఉరి తీసింది. ఇదే కేసులో నాగేంద్రన్ ధర్మలింగం అనే మానసిక వికలాంగుడిని సైతం వదల్లేదు సింగపూర్ ప్రభుత్వం. గత ఏడాది ఉరి తీసిన 11 మందిలో ఆయన కూడా ఉన్నారు. తంగరాజుకు ఉరిశిక్షను విధించడం దిగ్భ్రాంతి కలిగించిందంటూ బ్రిటన్‌కు చెందిన బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మరణశిక్షలను సింగపూర్ ప్రభుత్వం సమర్థించుకుంది. సమాజాన్ని మాదకద్రవ్యాలు, గంజాయి బారి నుంచి కాపాడటానికే తాము కఠిన చట్టాలను అమలు చేస్తోన్నామని సింగపూర్ హోమ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ దేశంపై చేస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని, సరైన సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాతే చట్టాన్ని అమలు చేస్తామని వివరించింది. తమదేశాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి మరణశిక్షలు తప్పవని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+