వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా కంటే సింగపూర్ ప్రధాని జీతం ఎంతో ఎక్కువ

By Srinivas
|
Google Oneindia TeluguNews

సింగపూర్: ప్రపంచంలోనే ఎక్కువ వేతనం తీసుకునే దేశాధినేత లేదా ప్రధానమంత్రి జాబితాలో సింగపూర్ ప్రధాని మొదటి స్థానంలో ఉన్నారు. ఎక్కువ వేతన తీసుకునే దేశాధినేత ఎవరు అంటే ఎక్కువ మంది అమెరికా అధ్యక్షుడిది అని చెప్పే అవకాశాలున్నాయి. కానీ సింగపూర్ ప్రధాని తీసుకునేది అత్యధిక వేతనం.

సింగపూర్ ప్రధాని లీ షైన్ లూంగ్ సంవత్సరానికి రూ.1.7 కోట్ల డాలర్లను తీసుకుంటున్నారు. మన రూపాయలలో ఇది దాదాపు రూ.11.4 కోట్లు. ఓ సగడు సింగపూర్ పౌరుడు ఏడాదికి సంపాదిస్తున్న దానికి ఇది 30 రెట్లు ఎక్కువ.

Singapore PM remains highest paid country

2012కు ముందు సింగపూర్ ప్రధాని జీతం ఏడాదికి రూ.2.8 కోట్ల డాలర్లుగా ఉండేది. అయితే తన జీం పట్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొనడంతో ఆయనే స్వయంగా జీతంలో కోత విధించుకున్నారు. అయినప్పటికీ ఇతర దేశాధినేతలతో పోలిస్తే ఆయననే టాప్‌లో ఉన్నారు.

జాబితాలో రెండో స్థానంలో హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ల్యూంగ్ చెన్ యుంగ్. అక్కడ ప్రభుత్వ అధినేతను చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా సంభోదిస్తారు. ఏడాదికి 5.3 లక్షల డారల్లను తీసుకుంటూ రెండో స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా మూడో స్థానంలో ఉన్నారు. ఈయన ఏడాది జీతం. రూ.4 లక్షల డాలర్లు. టాప్ 20లో భారత ప్రధాని లేదా రాష్ట్రపతి లేరు. భారత ప్రధాని జీతం రూ.19.2 లక్షలు కాగా, రాష్ట్రపతి జీతం రూ.18 లక్షలు.

English summary
Singapore PM Lee Hsien Loong remains highest paid country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X