మరీ ఇంత యంగ్ గా.. ఎలా? మహిళను ఎయిర్ పోర్టులో ఆపేసిన సిబ్బంది!

నటాలియా డెన్‌కివ్‌ అనే సింగర్ కు ఇటీవల న్యూయార్క్‌ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అనూహ్యంగా ఎయిర్‌పోర్టు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని.. కొన్ని గంటలపాటు ప్రశ్నించారు.

న్యూయార్క్‌: నలభై ఏళ్ల వయస్సులోనూ ఇరవై ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తే.. ఎలా ఉంటుంది? వావ్.. భలేగా ఉంటుంది అంటారా? కాస్తాగండి.. ఎందుకంటే, ఒక్కోసారి మరీ యవ్వనంగా కనిపిస్తే.. ఇలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.. చదవండి.. మీకే అర్థమవుతుంది.

నటాలియా డెన్‌కివ్‌ అనే సింగర్ కు ఇటీవల న్యూయార్క్‌ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అనూహ్యంగా ఎయిర్‌పోర్టు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని.. కొన్ని గంటలపాటు ప్రశ్నించారు.

కారణం.. 41 ఏళ్ల వయసున్న నటాలియా 20 ఏళ్ల యువతిలా.. యవ్వనంగా కనిపించడమే. అందంగా కనిపించడమే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమె పాస్ పోర్టు లోని ఫొటో చూసి, ఆమెను చూసిన సిబ్బందికి అనుమానం వచ్చింది.

Singer Natalia Dzenkiv Detained At Airport For Looking Too Young For Her Age On Passport

మరొకరి పాస్‌పోర్టుతోగాని నటాలియా ప్రయాణిస్తుందేమోనని అనుమానించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. టర్కీ నుంచి స్వదేశానికి తిరిగొస్తుండగా నటాలియాకు ఈ అనుభవం ఎదురైంది.

పిన్న వయస్కురాలిలాగా కనిపించడంతో ఎయిర్‌పోర్టు అధికారులు తనను ప్రశ్నించారని, ఇది సాధారణ విచారణలా కాకుండా.. తను కనిపించే తీరుకు ఒక ప్రశంసలా అనిపించిందని ఆమె మీడియాకు తెలిపారు.

''నేను అందంగా.. యవ్వనంగా కనిపించడంపై గతంలో ఎన్నో ప్రశంసలు దక్కాయి. కానీ, ఇలా కనిపించడమే ఒకరోజు ఇలాంటి చిక్కులు తీసుకొస్తుందని నేను అనుకోలేదు..'' అని నటాలియా పేర్కొంది. నటాలియా 'లామా' పేరుతో ప్రసిద్ధురాలు. ఎయిర్‌పోర్టులో ఆమె కనిపించడంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+