బానెట్ పై బుసలు కొడుతూ పాము, నడిరోడ్డుపై కారు నిలిపిన డ్రైవర్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్:కొన్నిసార్లు మనకు అనుకోని అతిథులు ఎదురౌతుంటాయి. అంతేకాదు ఈ ఘటనలు కొన్నిసార్లు మనల్ని భయకంపితుల్ని చేస్తుంటాయి. కొన్ని సమయాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు కూడ లేకపోలేదు. మరోవైపు ఒక్కో దాన్ని చర్యలతో మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులతోనే తప్పించుకోవచ్చు.

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కారుతో పాటు ఓ పాము షికారు చేసింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్కింగ్ ప్లేస్ లో కారును ఆపిన ర్యాన్ మార్పీ తన పనిని ముగించుకొని ఆ కారును తీయబోతే దాని బానెట్ పై దాదాపు 10 అడుగుల పాము కన్పించింది.

Snake Crawls Up Moving Car On A Highway, Tries To Get In

పాముకి కారుతో పాటు షికారు చేయాలనిపించిందని భావించిన కారు డ్రైవర్ మెక్ మార్పీ పాము కదలికలను వీడియో తీశాడు. కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా బానెట్ పై ఉన్న ఆ పాము అటూ ఇటూ కదిలింది.

బానెట్ నుండి పాకుతూ కారు విండో వద్దకు వచ్చి తలతో కొట్టింది పాము వల్ల తనకు ఎప్పటికైనా అపాయమని భావించిన మెక్ మార్పీ భయపడి కారును హైవే మధ్యలోనే నిలిపివేశాడు. వెంటనే పాము మెల్లగా కారు దిగి వెళ్ళిపోయింది. పాముతో తన హర్రర్ జర్నీని వివరిస్తూ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేయగా , ఆ వీడియో వైరల్ గా మారింది. కొందరు ఫేస్ బుక్ బుక్ లో ఈ వీడియో ను షేర్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nobody likes hitchhikers.. especially when it's a large, unwelcome snake slithering on your vehicle.Ryan McMurphy from Georgia, US was driving on the highway when he noticed the reptile crawling on his car's hood, making its way towards him. The fact that the car was moving didn't stop the cheeky snake from wriggling towards the driver.
Please Wait while comments are loading...