జపాన్‌లో మంచు విలయం: రికార్డు స్థాయిలో హిమపాతానికి 30 మంది బలి !
శీతాకాల వాతావరణ ప్రభావంతో జపాన్‌ను భారీ హిమపాతం ముంచెత్తింది. అంతర్గత వ్యవహారాలు, సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. జనవరి 20 నుండి ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా, 324 మంది గాయపడ్డారని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఫిబ్రవరి 2న స్థానిక సమయం మధ్యాహ్నం 1:30 గంటల నాటికి.. ఈ హిమపాతం ఎనిమిది ప్రిఫెక్చర్‌లలో నష్టాన్ని కలిగించింది. అత్యంత దారుణంగా ప్రభావితమైన ప్రిఫెక్చర్‌లో 12 మరణాలు, 97 గాయాలు నమోదయ్యాయి. మంచు తీసే సమయంలో పైకప్పుల నుండి పడి, లేదా పేరుకుపోయిన మంచులో కూరుకుపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం.

అలానే స్థానిక వాతావరణ కార్యాలయం ప్రకారం ఫిబ్రవరి 1న టోకామాచిలో మంచు 255 సెం.మీ.కు చేరింది. హిమపాతం కొనసాగుతుండగా.. ప్రిఫెక్చర్ ప్రభుత్వం మరిన్ని ప్రమాదాలపై హెచ్చరించింది. ఈ మేరకు భారీ హిమపాత ప్రతిస్పందన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, మంచు తొలగింపులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నివాసితులను కోరింది.
భారీ మంచు ఈశాన్య జపాన్‌లోని ఆమోరి ప్రిఫెక్చర్‌నూ కమ్మేసింది. అక్కడ 183 సెం.మీ. మంచు చేరింది, ఇది వార్షిక సగటుకు 2.7 రెట్లు. అధిక మంచుతో పైకప్పులు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానిక అధికారులు హెచ్చరించి, తక్షణ నివారణ చర్యలను కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications