వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లో పెను విషాదం.. మంచులో చిక్కుకుని 22 మంది మృతి..

By Kolli Venkata Kishore
|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌లోని ముర్రేలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న హిమపాతంలో వేలాది మంది పర్యాటకులు చిక్కుకున్నారు. మంచు కింద ప‌డి సుమారు 22 మంది మృతి చెందినట్లు అదికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవ‌డంతో.. ఊపిరాడక వీరంతా మరణించారని తెలిపారు.

భారీగా మంచు.. 22 మంది మృతి

ముర్రేలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్థానిక ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. మృతి చెందిన 22 మందిలో 10 చిన్నారులు ఉండడంతో తీవ్రంగా కలిచివేస్తోంది. ఇస్లామాబాద్‌కు చెందిన పోలీస్ అధికారి నవీద్ ఇక్బల్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు 8మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరంతా శరీరంలో ఉష్ణోగ్రలు తగ్గిపోయి.. ఊపిరాడక మృతి చెందారని అధికార్లు తెలిపారు.

ముర్రేకి పోటెత్తిన పర్యాట‌కులు

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ పర్యాటక కేంద్రం ముర్రీ ఉంది. ఇక్క‌డ‌ గత రెండు రోజులుగా భారీగా హిమపాతం కురుస్తుంది. మంచు అందాలను చూసేందుకు వేలాది మంది పర్యాటకులు తరలివచ్చారు.

ముర్రేకి ఒక్క‌సారిగాపెద్ద సంఖ్యలో జనం పోటెత్తడంతో ఇరుకైన ఈ రోడ్డు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ హిమపాతానికి ఉష్ణోగ్రలు మైనస్ 8 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఇస్లామాబాద్ నుంచి వచ్చే రహదారిని మూసివేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్‌ రషీద్‌ తెలిపారు.

ఉష్ణోగ్రతలు తగ్గిపోయి.. ఊపిరాడక మృతి

ఉష్ణోగ్రతలు తగ్గిపోయి.. ఊపిరాడక మృతి

ముర్రేలో ఒక్క రాత్రిలోనే నాలుగు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి.. ఊపిరాడక మృతి చెందారని రషీద్ తెలిపారు. కార్లలో ఇరుక్కొని మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. అటు కార్ హీటరలను ఎక్కువ సేపు రన్ చేయడంతో కార్బన్ మోనాక్సైడ్ విడుదలై ఉంటుందని ఇది కూడా వారి మరణానికి కారణమై ఉండోచ్చన్న అభిప్రాయాన్ని రషీద్ వ్యక్తం చేశారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్బ్రాంతి

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్బ్రాంతి

ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేప‌ట్టాల‌ని అదేశించారు. ముర్రే ప్రాంతాంలో ఆంక్ష్క్షలు విధించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యల్లో పాల్గొనేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్ధార్ వెల్ల‌డించారు. సుమారు లక్షవాహనాలను హిల్ స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అటు మంచులో చిక్కుకున్న పర్యాటకులకు స్థానికులు ఆహారం , దుప్పట్లు అందజేస్తున్నారు.

English summary
Snows Storm in Pakistan, 22 people 22 dead..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X