16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం..!
సోషల్ మీడియా.. అబ్బో ప్రస్తుతం నడుస్తున్న ఈ జమానాలో ఈ పిచ్చి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గంటల కొద్దీ ఫోన్లలో గడపడం.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో రీల్స్, మీమ్స్ చూస్తూ మునిగిపోవడం వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో నిద్రలేమి, ఏకాగ్రత లోపం, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆన్‌లైన్ బుల్లీయింగ్ వంటి సమస్యలు తీవ్రంగా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అనేక దేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణ అవసరమని డిమాండ్లు వచ్చాయి.
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్..
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను పూర్తిగా నిషేధిస్తూ ఆస్ట్రేలియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఇదే మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఈ నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్‌తో పాటు మెటా, ఆల్ఫాబెట్, బైట్‌డ్యాన్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్‌లన్నీ 16 ఏళ్లు నిండని పిల్లలను బ్లాక్ చేయాల్సిందే. పిల్లలు ఖాతా సృష్టించుకోవడం, యాప్‌ను యాక్సెస్ చేయడం, నోటిఫికేషన్‌లు పొందడం అన్నీ పూర్తిగా నిషేధం.

ఇప్పటికే ఉన్న ఖాతాలు ఆటోమేటిక్‌గా మూసివేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు పాటించకపోతే ప్లాట్‌ఫారమ్‌లు $33 మిలియన్ (సుమారు ₹275 కోట్లు) వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఈ నిర్ణయం చిన్న పిల్లలను రక్షించడానికి ఎంతో అవసరమని ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. గత రెండేళ్లుగా జరిగిన పరిశోధనల్లో పిల్లలలో సోషల్ మీడియా వల్ల తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నట్లు హెచ్చరికలు వచ్చాయి.
అంతే కాకుండా పిల్లల్లో రోజుకు సగటున మూడు నుంచి ఐదు గంటలు సోషల్ మీడియాలో గడపడం.. నిద్ర సమస్యలు పెరగడం, 30-40 శాతం పిల్లలు ఆన్‌లైన్ బుల్లీయింగ్‌కు గురవడం ఈ నిషేధానికి ప్రధాన కారణాలుగా ప్రభుత్వం వెల్లడించింది. తల్లిదండ్రుల సంఘాలు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం ఎంతో మంచిదని స్వాగతించాయి. చదువుపై దృష్టి పెరుగుతుందని, కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుందని వారు అంటున్నారు.
అయితే టెక్నాలజీ కంపెనీల నుంచి మాత్రం విమర్శలు వినిపించాయి. ఇలాంటి నిషేధాలు ఇంటర్నెట్ స్వేచ్ఛను తగ్గిస్తాయని, వయసు ధృవీకరణ సిస్టమ్‌లను ఖచ్చితంగా అమలు చేయడం సాంకేతికంగా కష్టమని కంపెనీలు వాదిస్తున్నాయి. కొంతమంది వాక్ స్వాతంత్య్ర న్యాయవాదులు కూడా ఈ చట్టం పిల్లల హక్కులను పరిమితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పిల్లల భద్రత ముఖ్యమని.. ఈ చట్టం అమలు తప్పనిసరిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈ నిర్ణయం పిల్లలకు వారి బాల్యాన్ని తిరిగి ఇస్తుందని అన్నారు. రోజురోజుకు పెరుగుతోన్న డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడానికి ఇది పెద్ద అడుగని వ్యాఖ్యానించారు. ఈ చట్టానికి మద్దతు తెలిపిన అన్ని రాష్ట్ర, స్థానిక నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియా వల్ల చిన్న పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని సంస్కరణలను కూడా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యూరప్, కెనడా, జపాన్ వంటి కొన్ని దేశాలు కూడా ఇదే దారిలో అడుగులు వేయాలని ఆలోచిస్తున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications