అతనో ఎంపీ.. సూసైడ్ బాంబర్ గా మారి 13మందిని..

Subscribe to Oneindia Telugu

మొగదీషు : అతనో మాజీ ఎంపీ.. తీవ్రవాదులతో చేతులు కలిపి భారీ హింసను కారణమయ్యాడు. హింసను రెచ్చగొట్టడం ఏకంగా ఆయనే ఆత్మహుతి (సూసైడ్ బాంబర్) అవతారమెత్తాడు. తనను తాను పేల్చేసుకుని నిర్దాక్షిణ్యంగా 13 మందిని పొట్టనబెట్టుకున్నాడు.

సోమాలియాలో జరిగిన ఈ ఘటనలో అక్కడి మాజీ ఎంపీ సలాహ్ బాద్ బాదో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. మంగళవారం నాడు సోమాలియా రాజధాని మొగదీషులోని శాంతి భద్రతా దళాల హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసి మొత్తం 13 మందిని బలి తీసుకున్నాడు. 53 సంవత్సరాలున్న సదరు ఎంపీ సలాహ్.. 2004 నుంచి 2010 వరకూ ఎంపీగా ఉన్నాడు.

Somalia attack: 'Ex-MP' was Mogadishu suicide bomber

అనంతరం ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా వ్యవహరిస్తోన్న అల్ షబాబ్ లో చేరి ఉగ్రవాదిగా మారాడు. అల్ షబాబ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇలా ఆత్మాహుతికి పాల్పడి సోమాలియన్లను పొట్టనబెట్టుకున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An ex-MP was one of two suicide car bombers who carried out Tuesday's deadly attacks in Somalia's capital, Mogadishu, militants have said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి