117 మంది మృతి: సౌతాఫ్రికాలో కొనసాగుతోన్న నిరసన ప్రదర్శనలు
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాను గత వారం జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రారంభమైన హింసాత్మక నిరసనల్లో ఇప్పటివరకూ 117 మంది చనిపోయారు. గురువారం నిరసన ప్రదర్శనలు మొదలు కాగా.. తర్వాత హింసాత్మకంగా మారాయి. షాపింగ్ మాల్‌కు నిప్పు పెట్టారు. షాపులను ధ్వంసం చేశారు. దక్షిణాఫ్రికా సోషల్ మీడియాలో విధ్వంసం, నిప్పుపెట్టడానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా నిరసన ప్రదర్శనలను 1990 తర్వాత దేశంలో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పారు. లూటీలు ఇలాగే కొనసాగితే, ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పదార్థాల కొరత ఏర్పడవచ్చు. నెల్సన్ మండేలా స్వస్థలం చాలా షాపులు లూటీ చేశారని, ఏటీఎంలను ధ్వంసం చేశారని చెప్పారు. రెస్టారెంట్లు, బార్లు, బట్టల షాపులను ఘోరంగా నాశనం చేశారని తెలిపారు. నిరసన ప్రదర్శనలు మిన్నంటడంతో ఇప్పటివరకు 2 వేల మందిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఆపడం కష్టమవుతోంది.












Click it and Unblock the Notifications