వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిదే: అక్టోబర్‌లో కిమ్ మరిన్ని అణు పరీక్షలు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

సియోల్: వచ్చే నెలలో ఉత్తర కొరియా మరిన్ని కవ్వింపుచర్యలకు పాల్పడవచ్చని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు అణు క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లుగానే అక్టోబర్‌లో కూడా అలాంటి పరంపరనే కొనసాగించే అవకాశం ఉందన్నారు.

వచ్చే నెలలో కమ్యూనిస్టు పార్టీ వార్షికోత్సవం నేపథ్యంలో దానికి సమాంతరంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌తో ఆ దేశ రక్షణశాఖ సలహాదారు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయం చెప్పారు.

South Korea Expecting More Provocations From North Korea In October

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు వరుసగా ఉత్తర కొరియా ఏదో ఒక చర్యలకు దిగబోతోందని తమ వద్ద సమాచారం ఉందన్నారు. పూర్తి వివరాలు అందించేందుకు నిరాకరించారు.

అయితే, సైనిక చర్యలు, దౌత్యం ద్వారా ఉత్తర కొరియాతో సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తోందని దక్షిణ కొరియా అభిప్రాయపడింది.మరోసారి యుద్ధానికి వెళ్లడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల వరుసగా అణు కార్యక్రమాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉభయ కొరియా ప్రాంతాలతోపాటు అటు ప్రపంచ అగ్ర దేశాల్లో కూడా గుబులు బయలుదేరిన విషయం తెలిసిందే.

English summary
South Korea expects North Korea to engage in more provocative action next month to coincide with the anniversary of the founding of its communist party and China's all-important Communist Party Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X