• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక కిమ్ పని ఖతం.. దక్షిణ కొరియా పక్కా ప్లాన్, స్పార్టన్ 3000 దళం ఏర్పాటు, ఆయుధం అభివృద్ధి!?

By Ramesh Babu
|

సియోల్: అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లకు కొరకరాని కొయ్యగా మారిన ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌ను హత్య చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కిమ్‌ను అంతం చేయడానికి దక్షిణకొరియాలో పక్కా ప్రణాళికలు రూపొందుతున్నాయి.

అణుబాంబు కన్నా తీవ్రమైనదే! బరువు 250 కిలో టన్నులు, ఉత్తరకొరియా మళ్లీ ఏదో చేస్తోంది.. ఏమిటది?అణుబాంబు కన్నా తీవ్రమైనదే! బరువు 250 కిలో టన్నులు, ఉత్తరకొరియా మళ్లీ ఏదో చేస్తోంది.. ఏమిటది?

కిమ్‌ను రాత్రివేళల్లో హతమార్చడానికి ఓ ప్రత్యేక దళాన్ని దక్షిణకొరియా తయారు చేయనుందనే ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే మరో వార్త సంచలనంగా మారింది. అతడిని సులువుగా చంపే ఆయుధాన్ని కూడా దక్షిణకొరియా అభివృద్ధి చేసిందట. కేవలం 15 నిమిషాల్లోనే కిమ్‌ను హత్య చేసేందుకు అడ్వాన్స్‌డ్ ఎయిర్‌-లాంచ్‌డ్ క్రూజ్ మిసైల్‌ను దక్షిణకొరియా మిలిటరీ పరీక్షించినట్లు భోగట్టా.

ఐరాస కఠిన ఆంక్షలు, అయినా తగ్గని ఉత్తరకొరియా, అమెరికా అంతు చూస్తామని హెచ్చరికఐరాస కఠిన ఆంక్షలు, అయినా తగ్గని ఉత్తరకొరియా, అమెరికా అంతు చూస్తామని హెచ్చరిక

సరికొత్త ఆయుధం అభివృద్ధి...

సరికొత్త ఆయుధం అభివృద్ధి...

ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పని పట్టేందుకు అభివృద్ధి చేసినట్లుగా చెబుతున్న ఈ అడ్వాన్స్‌డ్ ఎయిర్‌-లాంచ్‌డ్ క్రూయిజ్ మిసైల్‌ ను జర్మనీకి చెందిన తారుస్ సిస్టమ్స్ రూపొందించినట్లు తెలుస్తోంది.

రాడార్ వ్యవస్థలు పసిగట్టలేవు..

రాడార్ వ్యవస్థలు పసిగట్టలేవు..

ఈ అడ్వాన్స్‌డ్ ఎయిర్‌-లాంచ్‌డ్ క్రూయిజ్ మిసైల్‌ అత్యధికంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని దక్షిణకొరియా రక్షణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. దీన్ని రాడార్ వ్యవస్థలు కూడా గుర్తించలేవని, లక్ష్యం వైపు వేగంగా దూసుకెళుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

15 నిమిషాల్లో.. ఖేల్ ఖతం?

15 నిమిషాల్లో.. ఖేల్ ఖతం?


ఉత్తరకొరియా ఎక్కడైతే అణుపరీక్షలు జరుపుతోందో.. ఆయా ప్రాంతాలపై కేవలం 15 నిమిషాల్లో దాడి చేసే అవకాశం ఉందని, కిమ్‌ను కూడా అంతే సమయంలో మట్టుబెట్టవచ్చని దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు.

వ్యూహాలకు పదునుపెడుతున్న దక్షిణ కొరియా...

వ్యూహాలకు పదునుపెడుతున్న దక్షిణ కొరియా...


ఇటీవల ఉత్తరకొరియా జరిపిన హైడ్రోజన్ బాంబు పరీక్షల అనంతరం దక్షిణకొరియా చురుకుగా వ్యవహరిస్తూ తాను కూడా తన ఆయుధాలను పరీక్షిస్తోంది. అమెరికా సలహాల మేరకు తన వ్యూహాలకు పదునుపెడుతోంది.

కిమ్ అంతానికి.. స్పార్టన్ 3000 ప్రత్యేక దళం...

కిమ్ అంతానికి.. స్పార్టన్ 3000 ప్రత్యేక దళం...

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను అంతమొందిచడానికి స్పార్టన్ 3000 పేరుతో ఓ ప్రత్యేక దళాన్ని కూడా దక్షిణ కొరియా తయారు చేస్తున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఆ దిశగా దక్షిణ కొరియా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు సెప్టెంబరు 4 వ తేదీన ఆ దేశ రక్షణ మంత్రి సాంగ్ యంగ్ మూ వెల్లడించినట్లు సమాచారం.

నిశీధి వేళ.. నియంత కిమ్ ఖతం?

నిశీధి వేళ.. నియంత కిమ్ ఖతం?

దక్షిణ కొరియా ప్లాన్ ప్రకారం స్పార్టన్ దళం ఈ ఏడాది చివరి నాటికి సిద్ధంగా ఉంటుందట. ఈ దళ సభ్యులు.. రాత్రి వేళలో ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ను అంతమొందిస్తారట. ఈ వ్యూహానికి దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు బీజం వేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

English summary
Following North Korea’s successful test of its sixth and most powerful nuclear bomb earlier this month, the South Korean military has announced it’s creating an assassination unit called the Spartan 3000 to carry out night raids in North Korea. Once in the North, the group could be tasked to kill the leadership — primarily Kim. It could go in early and preempt a North Korean attack on the South, or fight in the middle of a war.South Korean Defense Minister Song Young-moo told lawmakers of the government’s intention to build the “decapitation unit” on September 4, the day after the recent nuclear test. The administration wants the team ready by the end of the year. The unit is central to a longstanding plan to fight North Korea if necessary — called “Korea Massive Punishment and Retaliation.” In September 2016, the North tested its fifth nuclear weapon, which at that point was the largest bomb it had detonated. Two days later, the South Korean military noted it had the option to kill North Korean leadership, including Kim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X