పోర్న్ చిత్రాల కోసం సెర్చ్ చేస్తే షాక్: 5 ఏళ్ళ శిక్ష

Posted By:
Subscribe to Oneindia Telugu

సియోల్: ఆన్‌లైన్‌లో పోర్న్ చిత్రాల కోసం వెతికేవారికి దక్షిణ కొరియా పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఆన్‌లైన్‌లోని పోర్న్ చిత్రాల కారణంగా దక్షిణకొరియాలో ఏటేటా నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు దక్షిణకొరియా పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు.

స్మార్ట్‌ఫోన్‌తో యావత్‌ ప్రపంచాన్నీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్లతో లాభాలు, నష్టాలు కూడ లేకపోలేదు. అయితే స్మార్ట్ ఫోన్లను మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం.

South Korean police make 'shock therapy' hidden camera porn video

ప్రస్తుతం అరచేతిలో అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. అయితే దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫి పెద్ద సమస్యగా మారింది. రహస్యంగా అమర్చిన కెమెరాలతో ప్రతి ఏడాది వేల కొద్ది లైంగిక నేరాలు జరుగుతున్నాయి. ఇలా రహస్యంగా చిత్రీకరించిన దృశ్యాల కోసం ఆన్‌లైన్‌లో వెతికేవారు ఎక్కువ అవుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు దక్షిణ కొరియా పోలీసులు ఊహించని షాక్‌ ఇస్తున్నారు.

దక్షిణ కొరియా పోలీసులు 'షాక్ థెరపీ' పేరుతో సీక్రెట్‌ కెమెరా శృంగార వీడియోలను తయారు చేసింది. వీటిని ఫైల్‌ షేరింగ్‌ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశారు. వీటిని పోర్న్‌ వీడియోలుగా భావించి గత నెల 17 నుంచి 31లోపు దాదాపు 30 వేల మంది ఓ వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.. ' ఆమె ఆత్యహత్య చేసుకోవడానికి మీరు కారణం కావొచ్చు' లాంటి హెచ్చరికలు ఇందులో కనిపిస్తున్నాయి. ఈ షాక్ థెరపీతో పోర్న్ దృశ్యాలు చూసేవారిని నియంత్రించొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీక్రెట్‌ కెమేరాలతో వీడియోలు చిత్రీకరించేవారు దొరికితే అయిదేళ్ల జైలు శిక్ష ఖాయమని పోలీసులు హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police in South Korea have made a fake voyeuristic video in an effort to tackle sex crimes involving hidden cameras.The video, titled Fitting Room, was uploaded to file-sharing websites and downloaded by 26,000 unsuspecting viewers between October 17 and 31.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి