వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ 'యుద్దం': అమెరికాను సముద్రంలో కలిపేస్తామని!, బాంబుల వర్షం తప్పదన్న ద.కొరియా

దక్షిణ కొరియా సైతం ఉత్తరకొరియాపై బాంబులతో విరుచుకుపడటానికి సిద్దమైంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

North Korea vs US : Donald Trump issued an Ultimatum To Kim Jong-un

ప్యోంగ్‌యాంగ్: యుద్ద హెచ్చరికలు.. కవ్వింపు చర్యలు.. ఉత్తరకొరియా దుందుడుకు వైఖరికి ఏమాత్రం బ్రేక్ పడట్లేదు. సరికదా.. ఎప్పటికప్పుడు తన వైఖరిని బయటపెడుతూ అణు క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాను ఢీకొట్టాలన్న మితీమిరిన విశ్వాసం, పొరుగు దేశాలను భయభ్రాంతులకు గురిచేయాలన్న అత్యుత్సాహం ఉత్తరకొరియాలో అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

ఉత్తరకొరియాను నిలువరించాలంటే ఇక యుద్దం అనివార్యం అన్న ఆలోచనలో దాని పొరుగు దేశాలు జపాన్, దక్షిణ కొరియా ఉన్నాయి. మంగళవారం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ చేసిన క్షిపణి ప్రయోగం జపాన్ ను బెంబేలెత్తించింది.

నో డౌట్, అది నిజమే.. అమెరికాకు డేంజర్ బెల్స్: ఉ.కొరియాపై ఇంటలిజెన్స్ హెచ్చరికనో డౌట్, అది నిజమే.. అమెరికాకు డేంజర్ బెల్స్: ఉ.కొరియాపై ఇంటలిజెన్స్ హెచ్చరిక

బెంబేలెత్తిన జపాన్:

బెంబేలెత్తిన జపాన్:

ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి పసిణిక్ సముద్ర జలాల్లో మూడు భాగాలుగా విడిపోయి పడిపోయింది. అప్పటిదాకా క్షిపణి తమ మీదకే దూసుకొస్తుందని భయపడ్డ జపాన్ ఊపిరి పీల్చుకుంది. జపాన్‌కు చెందిన హొక్కైడో ద్వీపకల్పం మీదుగా ఉత్తరకొరియా ఈ క్షిపణిని ప్రయోగించింది. కిమ్ క్షిపణి ప్రయోగంపై సమాచారం అందిన వెంటనే.. ప్రజలంతా ఇళ్లలోకి వెళ్లిపోవాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిందంటే అక్కడెంత భయాందోళనలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.

బాంబుల మోతకు సిద్దమైన ద.కొరియా:

బాంబుల మోతకు సిద్దమైన ద.కొరియా:

కిమ్ చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగంపై దక్షిణ కొరియాకు ముందస్తు సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. కిమ్ ను నిలువరించాలంటే ఇక బాంబుల వర్షం కురిపించక తప్పదని ఆ దేశం భావిస్తోంది. ఇరు దేశాల సరిహద్దులో బాంబుల వర్షం కురిపించి తామెంత ప్రమాదకారులమో చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

8 బాంబులతో సిద్దం:

8 బాంబులతో సిద్దం:

మంగళవారం నాడు ఉత్తరకొరియా సరిహద్దులో బాంబులు వేస్తామని దక్షిణ కొరియా అందులో పేర్కొంది. ఉత్తరకొరియా సరిహద్దులో 8బాంబులు వేసేందుకు అధ్యక్షుడు మూన్ జే ఆదేశాలు జారీ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఎఫ్15కే ఫైటర్ జెట్ల ద్వారా ఎనిమిది మార్క్ 84బాంబులను సరిహద్దులో వేస్తామని తెలిపింది.

ఉ.కొరియా హెచ్చరిక:

ఉ.కొరియా హెచ్చరిక:

దక్షిణ కొరియా బాంబు హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు మరోసారి రెచ్చిపోయారు. తమ దేశంపై దండయాత్ర చేస్తే అమెరికా మొత్తాన్ని సముద్రంలో కలిపేందుకు సిద్దంగా ఉన్నామని, విధ్వంసపు కత్తితో పొడవాలని చూస్తున్న దక్షిణ కొరియాను, దాని వెనకాల ఉన్న అమెరికాను ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దమని ప్రకటించింది.

అమెరికా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే ఉత్తర కొరియా నావికాదళం తామేంటో చూపిస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆదేశానికి చెందిన అధికార పత్రిక రొడాంగ్ సిన్మన్ ఒక కథనం వెలువరించింది. ఉత్తరకొరియా నావికాదళ 68వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కథనాన్ని వెలువరించింది.

English summary
SOUTH Korea have carried out a bombing campaign near the Northern border in response to Kim Jong-un’s earlier missile strike, South Korea's Chief Press Secretary has confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X