వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షంలో స్పేస్ స్టేషన్‌కు ప్రమాదం... నాసా హెచ్చరిక: కారణం అదే..!!

|
Google Oneindia TeluguNews

నాసా: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఓ యాంటెన్నా విరిగిపోవడంతో వ్యోమగాములు అక్కడికి వెళ్లి దాని స్థానంలో మరో యాంటెన్నా ఉంచిన కొద్ది సమయానికే ఓ ముఖ్యమైన సమాచారం చేరవేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు భూమికి పంపారు. నింగిలోని అంతరిక్ష వ్యర్థాలతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఈ మొత్తం వ్యవస్థను ప్రస్తుతం ఉన్న కక్ష్యలో కాస్త దిగువకు మార్చాలని సూచించారు. కక్ష్యలోకి చేరిన వ్యర్థ పదార్థాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు ఏ క్షణమైనా హాని తలపెట్టే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల్లోపు అంతరిక్ష కేంద్రంను అనుకున్న దిశగా మార్చకపోతే శిథిలాల నుంచి ప్రమాదం తప్పదని హెచ్చరించారు.

స్పేస్ స్టేషన్‌ సమీపంలోకి శిథిలాలు

"అంతరిక్షంలో శిథిలాల నుంచి స్పేస్‌ స్టేషన్‌కు పొంచి ఉన్న ప్రమాదంపై నాసా మిషన్ కంట్రోల్‌తో కలిసి పనిచేస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. శిథిలాల నుంచి స్పేస్ స్టేషన్‌ను సురక్షితంగా ఉంచుతామన్న నమ్మకం ఉంది. శుక్రవారం సాయంత్రం స్పేస్ స్టేషన్‌కు అత్యంత సమీపంగా శిథిలాలు వచ్చే అవకాశాలున్నాయి.ఇక అదే సమయంలో స్పేస్ స్టేషన్‌ను ఢీ కొట్టే ప్రమాదం ఉంది." అని బ్లాగ్ పోస్టులో నాసా రాసుకొచ్చింది.

ఆ రాకెట్‌ ధ్వంసం కావడమే కారణమా..


1994 మే 19వ తేదీన పెగాసస్ రాకెట్‌ను నింగిలోకి పంపడం జరిగింది. రెండేళ్ల తర్వాత అంటే 1996 జూన్ 3వ తేదీన రాకెట్ రెండుగా చీలిపోయిందని ఇక అప్పటి నుంచి శిథిలాలు నింగిలో తేలియాడుతున్నాయని నాసా పేర్కొంది. ఆ శిథిలాలు స్పేస్ స్టేషన్‌ యాంటెన్నాను ఢీకొనడంతో యాంటెన్నా విరిగిపోయింది. దీంతో మరమత్తుకోసం ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. టామ్ మార్ష్ బర్న్ మరియు కేలా బారన్‌లు అనే ఇద్దరు వ్యోమగాములు స్పేస్‌వాక్ చేసి ధ్వంసమైన యాంటెన్నా స్థానంలో కొత్త యాంటెన్నాను బిగించారు. విరిగిన యాంటెన్నాలో 11 వ్యర్థ శిథిలాలను తాము కనుగొన్నట్లు వ్యోమగాములు తెలిపారు. ఈ యాంటెన్నా దాదాపుగా 20 ఏళ్ల పాటు సేవలందించింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుంచి పనిచేయడం మానేసింది. దీన్ని తొలగించి ఇప్పుడు కొత్త యాంటెన్నాను అక్కడ ఏర్పాటు చేశారు.

 ఉపగ్రహాన్ని కూల్చిన రష్యా

ఉపగ్రహాన్ని కూల్చిన రష్యా

ఇదిలా ఉంటే అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన అతిపెద్ద వయస్కుడిగా మార్ష్‌బర్న్ (61) రికార్డు సృష్టించారు. ఇలా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేయడం ఆయన కెరీర్‌లో ఇది నాల్గవ సారి కావడం విశేషం. ఇక కేలా బారన్‌ అనే మహిళ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లింది. ఆమె వయస్సు 34 ఏళ్లు. మంగళవారమే వీరు మరమత్తులు పూర్తి చేయాల్సి ఉండగా... నాసా ఆదేశాల మేరకు కాస్త జాప్యం చేయడం జరిగింది. అంతరిక్షంలో శిథిలాల కదలిక బాగా ఉండటంతో వీరు మరమత్తు పనిని వాయిదా వేశారు. ఇదిలా ఉంటే అంతరిక్షంలో శిథిలాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతనెలలో రష్యా ఒక పాత ఉపగ్రహాన్ని క్షిపణి ప్రయోగం ద్వారా కూల్చివేసింది. దీంతో ఆ ఉపగ్రహం నుంచి వెలువడిన వ్యర్థ శిథిలాలు ఎక్కడికంటే అక్కడికి వ్యాపించాయి. అయితే వ్యోమగాములు తమ పనిని వాయిదా వేసుకోవడానికి ఈ శిథిలాలే కారణమై ఉంటాయని నాసా అధికారికంగా ప్రకటించలేదు. అంతరిక్షంలో ఉపగ్రహాన్ని క్షిపణి ద్వారా కూల్చి శిథిలాలు వ్యాపింపజేసిన రష్యాపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా వైస్‌ప్రెసిడెంట్ కమలా హారిస్ నేతృత్వంలో జరిగిన ఓ సమావేశంలో రష్యా తీరును ఖండించింది.

English summary
Space station is likely to change its orbit today as there is a danger from the space debris reported NASA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X