వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యోమగాముల కోసం ఎలాంటి ఆహార పదార్థాలు అంతరిక్షంలోకి పంపిచారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వ్యోమగాములకు క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ కేక్‌తో పాటు ఇతర ఆహారా పదార్థాలను స్పేస్ ఎక్స్‌కు సంబంధించిన డ్రాగన్ క్యాప్సుల్ చేరవేసింది. ఇది కొన్ని రోజుల ముందుగానే స్పేస్ స్టేషన్‌కు చేరాల్సి ఉన్నప్పటికీ సమాచారలోపం సాంకేతిక కారణాలతో కొంత ఆలస్యంగా చేరుకుంది.

రెండవసారి విజయవంతంగా క్యాప్సూల్‌ను పట్టుకున్న వ్యోమగామి

రెండవసారి విజయవంతంగా క్యాప్సూల్‌ను పట్టుకున్న వ్యోమగామి

కేప్ కానవెరాల్ లాంచింగ్ స్టేషన్ నుంచి బయలు దేరిన మూడురోజులకు డ్రాగన్ క్యాప్సూల్ విజయవంతంగా అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్‌‌కు చేరుకుంది. అది చేరుకోగానే స్పేస్ స్టేషన్‌లో ఉన్న కమాండర్ అలెగ్జాండర్ జెర్ట్స్‌ రోబో సహాయంతో క్యాప్సూల్‌ను అందిపుచ్చుకున్నారు. క్యాప్సూల్‌ను అందుకోవడంలో తొలిప్రయత్నంలో విఫలమైనప్పటికీ రెండో ప్రయత్నంలో మాత్రం దాన్ని ఒడిసి పట్టుకున్నారు కమాండర్ అలెగ్జాండర్. సాంకేతిక కారణాలు, సమాచార వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో తొలిసారి క్యాప్సూల్‌ను అందుకోలేకపోయారు. ఇందుకు కారణం నాసాలోని ట్రాకింగ్ అండ్ డేటా రిలే శాటిలైట్ సిస్టమ్‌లో తాత్కాలికంగా సమాచార వ్యవస్థ దెబ్బతినింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మిషన్ కంట్రోల్ ఆదేశాలతో క్యాప్సూల్‌ను తిరిగి రప్పించారు. ఇక గంటన్నరలోనే నాసా మరో ట్రాకింగ్ అండ్ డేటా రిలే శాటిలైట్ సిస్టమ్‌ వినియోగించడంతో విజయవంతంగా క్యాప్సూల్‌ను పట్టుకోగలిగారు.

అంతరిక్షంలోకి టర్కీ పక్షి ఇతరత్ర ఆహార పదార్థాలు

అంతరిక్షంలోకి టర్కీ పక్షి ఇతరత్ర ఆహార పదార్థాలు

ఇక డ్రాగన్ క్యాప్సూల్‌లో క్రిస్మస్ కానుకలతో పాటు అక్కడి వ్యోమగాములకు కావాల్సినవన్నీ పంపడం జరిగింది. క్రిస్మస్ రోజున విందు కోసం టర్కీ పక్షితో పాటు గ్రీన్ బీన్ కాసెరోల్, తడిసిన దుంపలు,క్రాన్‌బెరీ సాస్, ఫ్రూట్ కేక్‌లను పంపించారు. అంతేకాదు బ్రెడ్ బటర్‌లతో కూడిన చాక్లెట్లు కూడా పంపడం జరిగింది. వ్యోమగాముల ప్రయోగాల కోసం ఎలుకలు, ఇతర కీటకాలను కూడా పంపారు. 2,270 కిలోల బరువున్న స్పేస్ స్టేషన్ పరికరాలను కూడా క్యాప్సూల్ మోసుకెళ్లింది.

అంతరిక్షంలో ఆరుగురు వ్యోమగాములు

అంతరిక్షంలో ఆరుగురు వ్యోమగాములు

ఇప్పటికి ఆరుగురు వ్యోమగాములు అంతరిక్ష స్టేషన్‌లో ఉండగా... డిసెంబర్ 20న ముగ్గురు వ్యోమగాములు తిరిగి భారత్‌కు చేరుకుంటారు. మరో ముగ్గురు అక్కడే ఉంటారు. ఈ వ్యోమగాముల్లో ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు రష్యన్లు, ఒకరు కెనడాకు చెందిన వారు కాగా మరో వ్యక్తి అలెగ్జాండ్ జర్మనీకి చెందిన వారు. 2012 నుంచి నాసా కోసం స్పేస్ ఎక్స్ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తోంది. అంతరిక్షంలో వ్యోమగాముల అవసరాల నిమిత్తం డ్రాగన్ క్యాప్సూల్ సేవలు అందించడం ఇది 16వ సారి కావడం విశేషం.

English summary
A SpaceX delivery full of Christmas goodies arrived at the International Space Station on Saturday, following a slight delay caused by a communication drop-out.The Dragon capsule pulled up at the orbiting lab three days after launching from Cape Canaveral. Commander Alexander Gerst used the space station's big robotic arm to grab the cargo carrier, as the two craft soared 250 miles above the Pacific.It took two tries to get the Dragon close enough for capture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X