వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలు కోరుకుందొకటి...వాడు చేసిందొకటి: 49 మందికి కడుపు చేసిన డాక్టర్

|
Google Oneindia TeluguNews

ఆయన పేరుగాంచిన వైద్యుడు. వైద్యం తెలుసు కదా అని చెప్పి తప్పుదారి పట్టాడు. సంతానం లేరని వచ్చిన మహిళల పట్ల ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఇంతకీ ఆ డాక్టరు ఎవరు.. ఏంచేశాడు... ఇప్పుడెందుకు వార్తల్లో ఉన్నాడు..?

 సంతానం కోసం వస్తే ఏమి చేశాడో తెలుసా..?

సంతానం కోసం వస్తే ఏమి చేశాడో తెలుసా..?

నెదర్లాండ్స్‌కు చెందిన జాన్ కార్బట్ అనే ఓ డాక్టర్ 49 మంది పిల్లలకు తండ్రయ్యాడు. చదవటానికి లేదా వినటానికి ఇది కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఇదే నిజం. అసలు విషయానికొస్తే డాక్టర్ జాన్ కార్బట్ ప్రముఖ ఫర్టిలిటీ డాక్టర్. సంతానం లేని దంపతులకు చికిత్స అందిస్తాడు. రోటర్‌డ్యామ్‌లోని బిజ్‌డార్ప్‌లో తను క్లినిక్ నిర్వహిస్తూ ఉంటాడు. సంతానం లేని వాళ్లు జాన్ కార్బట్ క్లినిక్‌కు చికిత్స కోసం వచ్చిన సమయంలో దాత ఇస్తున్న వీర్యం కాకుండా తన సొంత వీర్యాన్ని మహిళ గర్భంలోకి ప్రవేశింప జేసేవాడు. దీంతో ఆ మహిళలు గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చేవారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 49 పిల్లలకు పరోక్షంగా జన్మనిచ్చారు.

 ఓ వ్యక్తి అచ్చం డాక్టర్ పోలికలతో పుట్టడంతో బయటపడిన భండారం

ఓ వ్యక్తి అచ్చం డాక్టర్ పోలికలతో పుట్టడంతో బయటపడిన భండారం

పాపం చేస్తే ఏదో ఒక రోజు తప్పక పండుతుంది. దోషి దొరుకుతాడు. సరిగ్గా డాక్టరు విషయంలో కూడా ఇదే జరిగింది. ఇలా తన వీర్యంను చికిత్స కోసం వచ్చిన మహిళల్లోకి ఇంజెక్ట్ చేయగా ఓ మహిళకు అచ్చం డాక్టర్ కార్బట్‌ పోలికలతో ఉన్న పిల్లాడు పుట్టాడు. పెరిగి పెద్ద అవుతున్న ఆ పిల్లాడు ఒక వయస్సు వచ్చేసరికి డాక్టర్ కార్బట్ పోలికలతో కనిపించడంతో అసలు సంగతి బయటపడింది. డాక్టర్ కార్బట్ ‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరాన్ని ఆయన అంగీకరించాడు. ఇలా సంతానం లేమితో చికిత్సకు వచ్చిన మహిళలందరికీ అనుమానం రావడంతో ఆ పిల్లలకు డీఎన్ఏ టెస్టులు చేయించగా అందులో 49 మందికి డాక్టర్ జాన్ కార్బట్ డీఎన్ఏ సరిపోలింది. డాక్టర్ కార్బట్‌ను జైలుకు తరలించారు. శిక్ష పొందుతూ మరణించారు. ఇందిలా ఉంటే 2009లోనే ఆయన క్లినిక్ మూతపడినట్లు తెలుస్తోంది.

కోర్టుకు వెళ్లిన వ్యవహారం

కోర్టుకు వెళ్లిన వ్యవహారం

బాధితులు కొందరు కార్బట్ కుటుంబాన్ని కోర్టుకు లాగారు. అయితే కార్బట్ చేసిన పనికి తమకు సంబంధం లేదని కోర్టులో వాదించారు. అంతేకాదు అతని వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయరాదని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ కోర్టు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. డీఎన్ఏ తాలూక వివరాలను తెలపాల్సిందే అని రూలింగ్ ఇచ్చింది. దీంతో డీఎన్ఏ వివరాలు తెలిశాయి. 11 ఏళ్ల తర్వాత రుజువులతో సహా తన తండ్రి జాన్ కార్బట్ అని తెలియడంతో తన జీవితం ఇప్పుడు సజావుగా సాగుతుందని ఓ వ్యక్తి తెలిపాడు.

English summary
A dutch fertility doctor Jan Kaarbat who injected his sperm instead of the donors fathered 49 children. This incident came to light when a person just looked the same as of Kaarbat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X