ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కరాచీలో స్పైస్ జెట్ ప్లైట్ ల్యాండ్, ప్యాసెంజర్స్ సేఫ్
స్పైస్ జెట్ విమానం ఒక్కటి అత్యవసరంగా పాకిస్థాన్ కరాచీలో దిగాల్సి వచ్చింది. స్పైస్ జెట్ విమానం బీకే37 విమానం ఒకటి ఢిల్లీ నుంచి దుబాయ్ వెళుతుంది. సాంకేతిక సమస్య వల్ల అదీ కరాచీకి మళ్లించారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యిందని.. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ప్లైట్ చెక్ చేసి పంపించామని.. కానీ సాంకేతిక సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. వారిని తిరిగి దుబాయ్ పంపించేందుకు మరొ ప్లైట్ కూడా పంపామని అధికారులు తెలిపారు. విమానంలో ఎడమ వైపు గల ట్యాంక్ నుంచి ఇంధనం వేగంగా తగ్గుతూ వచ్చింది. దానికి సంబంధించి చెక్ చేసినా.. తగ్గడంతో వెంటనే నిలిపివేయాల్సి వచ్చింది. అయితే విమానం బయల్దేరే ముందు చెక్ చేశారు. అయినప్పటికీ ఇంధనం లీక్ కాలేదు. ప్లైట్ గాలిలో ఉండగా.. ఇలా పరిణామం తగ్గుతూ వచ్చింది. దీంతో వారు వెంటనే కరాచీలో నిలిపివేశారు. వారిని దుబాయ్ పంపించేందుకు మరొ ప్లైట్ పంపించేశారు.
3600 అడుగుల ఎత్తులో విమానం ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. స్పైస్ జెట్ విమానాలు ఇటీవల మరో రెండు సందర్భాల్లో కూడా సమస్య తలెత్తింది. రెండురోజుల క్రితం ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ జబల్ పూర్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. వెంటనే ఆ విమానాన్ని ఢిల్లీకి రప్పించారు. ఇవాళ మరో విమానం కరాచీలో ల్యాండ్ చేశారు.

More than 150 passengers were present onboard the SpiceJet flight (Delhi-Dubai) that made an emergency landing in Karachi, Pakistan after developing a technical fault. pic.twitter.com/1flK3YbfcM
— ANI (@ANI) July 5, 2022












Click it and Unblock the Notifications