వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెస్ట్ ఇన్ పీస్ : స్పైడర్ మ్యాన్ సృష్టికర్త స్టాన్‌లీ ఇక లేరు

|
Google Oneindia TeluguNews

మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా... వారిని బుజ్జగించాలంటే చందమామ చూపించేవారు కదా... ఇది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాంటి కార్టూన్లు చూపించి వారిని లాలించి తినిపిస్తున్నారు. అయితే అందరికీ స్పైడర్ మ్యాన్ అంటే ఎలా ఉంటాడో తెలుసు.. స్పైడర్ మ్యాన్ సినిమాలు కూడా చూసి ఉంటాం... కానీ ఈ స్పైడర్ మ్యాన్ సృష్టి కర్త ఎవరో చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. స్పైడర్ మ్యాన్‌ సృష్టికర్త స్టాన్‌లీ. ఈయన సృష్టించిన ఈ క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. స్పైడర్ మ్యాన్‌ క్యారెక్టర్‌తో పాటు ఐరన్ మ్యాన్, హల్క్ లాంటి వాటికి కూడా స్టాన్‌లీ ప్రాణం పోశారు. వీటన్నిటికీ ప్రాణం పోసిన స్టాన్‌లీ సోమవారం తుది శ్వాస విడిచారు. మృతి చెందే నాటికి ఆయన వయస్సు 95 ఏళ్లు.

సూపర్ హీరోస్‌ను చూసి కొన్ని తరాలు ఎంజాయ్ చేశాయి

సూపర్ హీరోస్‌ను చూసి కొన్ని తరాలు ఎంజాయ్ చేశాయి

స్టాన్‌లీ ఒక రచయితగా, ఎడిటర్‌గా మంచి పేరు సంపాదించారు. తాను రాసిన కామిక్ బుక్ టైటన్ 1960వ దశకంలో ఓ సంచలనం సృష్టించింది. జాక్ కిర్బీ, స్టీవ్ డిట్కోలతో కలిసి స్టాన్‌లీ కొంతమంది సూపర్ హీరోస్‌ను క్రియేట్ చేశాడు. వాటిని కొన్ని తరాలు ఎంజాయ్ చేశాయి.. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తన అభిమానులను దృష్టిలో ఉంచుకునే ఎన్నో కొత్త క్యారెక్టర్లు సృష్టించేవారని స్టాన్‌లీ కూతురు జేసీ లీ తెలిపారు. జీవనం సాగించేందుకు తను చేసే పనిని ఎంతో ఇష్టంగా ప్రేమతో చేసేవారని ఆమె చెప్పారు. స్టాన్‌లీని కుటుంబం ఎంతగా అయితే ప్రేమించేదో అంతే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కవగానే అతని అభిమానులు ప్రేమ చూపేవారని గుర్తు చేశారు. ఆయన మరణం తీరని లోటని స్టాన్‌లీ కుమార్తె జేసీ లీ చెప్పారు. అయితే స్టాన్‌లీ మృతికి కారణం మాత్రం ఆమె వెల్లడించలేదు.

స్పైడర్ మ్యాన్‌తో పాటు మరికొన్ని క్యారెక్టర్లకు ప్రాణం పోశారు

స్పైడర్ మ్యాన్‌తో పాటు మరికొన్ని క్యారెక్టర్లకు ప్రాణం పోశారు

స్టాన్‌లీ ఫీల్డ్‌లోకి రాకముందే అమెరికన్లు సూపర్ హీరోలకు కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే 1938లోనే సూపర్ మ్యాన్‌ అనే క్యారెక్టర్‌ను ఆవిష్కరించారు. అయితే ఈ సూపర్ హీరోస్‌కు ప్రాణం పోసింది మాత్రం స్టాన్‌లీ అని చెప్పక తప్పదు. సూపర్ హీరోస్ డిజైనింగ్‌లో సహాయం చేసినప్పటికీ వాటిని ప్రమోట్ చేసే బాధ్యత మాత్రం స్టాన్‌లీనే తీసుకున్నారు. స్పైడర్ మ్యాన్‌తో పాటు హల్క్, ఎక్స్ మెన్, ఫంటాస్టిక్ ఫోర్, ప్లేబాయ్ ఐరన్ మ్యాన్‌లను స్టాన్‌లీ సృష్టించారు.

స్టాన్‌లీ క్రియేట్ చేసిన క్యారెక్టర్లపై సినిమాలు

స్టాన్‌లీ క్రియేట్ చేసిన క్యారెక్టర్లపై సినిమాలు

స్టాన్‌లీ క్రియేట్ చేసిన దాదాపు అన్ని క్యారెక్టర్లను బేస్ చేసుకుని సినిమాలు వచ్చాయి. ఇవి 21 శతాబ్దం తొలి నాళ్లలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఈ క్యారెక్టర్ ఉన్న సినిమాలు విడుదలై 20బిలియన్ డాలర్ల గ్రాస్‌ను సంపాదించాయంటే ఈ క్యారెక్టర్స్‌కు ఏపాటి క్రేజ్ ఉండేదో ఊహించొచ్చు. ఇక హాలీవుడ్ స్టూడియోలు సూపర్ హీరోస్‌ పైనే సినిమాలు ఎక్కువగా తీసి విపరీతమైన లాభాలు పొందేవి. దీని ద్వారానే స్టాన్‌లీ ఆస్తి కూడా విపరీతంగా పెరిగిపోయాయనే టాక్ వచ్చింది. అయితే ఇందులో నిజం లేదని స్టాన్‌లీ స్పష్టత ఇచ్చారు. 2008లో స్టాన్‌లీ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఆయన్ను ప్రతిష్టాత్మక నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్ అవార్డుతో గౌరవించింది.

English summary
Stan Lee, who dreamed up Spider-Man, Iron Man, the Hulk and a cavalcade of other Marvel Comics superheroes that became mythic figures in pop culture with soaring success at the movie box office, died at the age of 95, his daughter said on Monday.As a writer and editor, Lee was key to the ascension of Marvel into a comic book titan in the 1960s when, in collaboration with artists such as Jack Kirby and Steve Ditko, he created superheroes who would enthral generations of young readers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X