వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక సంక్షోభం:కనిపిస్తే కాల్చేయండి: మిలటరీ ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

శ్రీలంక ఆర్ధిక సంక్షోభం బారిన పడి ఆ తర్వాత రాజకీయ సంక్షోభానికి దిగజారిన శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించినా పరిస్ధితులు అదుపులోకి రావడం లేదు. అధ్యక్షుడు గోటబాట రాజపక్స కుటుంబంపై ఉన్న ఆగ్రహంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి రాజకీయ నేతలపై దాడులు చేయడం, వాళ్ల ఇళ్లు తగులబెట్టడం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర చర్యలకు దిగుతోంది. ఇప్పటికే ఆర్మీకి ఆదేశాలు ఇవ్వడంతో పాటు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు అమల్లోకి తెచ్చింది.

శ్రీలంకలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినప్పటికీ ఆర్థిక సంక్షోభంపై హింసాత్మక నిరసనలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాజపక్స కుటుంబంతో సహా పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు నిప్పు పెట్టారు. పోలీసులు అడ్డుకుంటున్నా వారిపైనే దాడులకు దిగుతూ మరీ ప్రజలు రెచ్చిపోతున్నారు.

Sri Lanka Crisis live Updates in telugu:Shoot at sight orders issued by defence ministry

Newest First Oldest First
1:22 PM, 28 May

శ్రీలంక దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఆందోళనలు. ఈ దేశవ్యాప్త నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు 50వ రోజుకు చేరుకున్నాయి.
12:21 PM, 28 May

ఆర్థిక సహకారంపై భారత్‌లోని శ్రీలంక రాయబారి, హైకమిషనర్.. ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ కావడం ఇది రెండోసారి.
12:05 PM, 28 May

ఆర్థిక సంక్షోభ సుడిగుండంలో చిక్కుకున్న శ్రీలంక.. భారత్ నుంచి మరింత సహాయ, సహకారాన్ని కోరుకుంటోంది. ఈ దిశగా భారత్‌లోని శ్రీలంక హైకమిషనర్ మొనగొడ.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో దేశ రాజధానిలో సమావేశం అయ్యారు.
10:02 AM, 27 May

ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రజా రవాణా వ్యవస్థను నియంత్రించాల్సిన అవసరం ఉందని, రైల్వే అధికారులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి బండుల గుణవర్దనె
9:53 AM, 27 May

ఇంధనాన్ని పొదుపు చేయడంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించిన శ్రీలంక ప్రభుత్వం. రవాణా వ్యవస్థపై ఆంక్షలను విధించనున్నట్లు వెల్లడించిన జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి బండుల గుణవర్ధనె
3:43 PM, 25 May

లోన్ ప్యాకేజీ కోసం ఇంటర్నేషనల్ మనీ ఫండ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించిన శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె. సంతృప్తికరమైన లోన్ ప్యాకేజీ అందుతుందని ఆశిస్తున్నట్లు స్పష్టీకరణ.
2:41 PM, 25 May

ద్రవ్యోల్బణం 40 శాతానికి చేరుకోవచ్చని, దీన్ని నియంత్రించడానికి తక్షణ చర్యలను తీసుకుంటున్నామని వెల్లడించిన శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె. ఆర్థికశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలను స్వీకరించారు.
1:15 PM, 25 May

ఆరు వారాల వ్యవధిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతానని, ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టనున్నట్లు తెలిపిన శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె. ఆర్థికశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలను స్వీకరించారు.
1:10 PM, 25 May

రెండు సంవత్సరాల పాటు అమలులో ఉండేలా ప్రత్యేకంగా రిలీఫ్ ప్యాకేజీని ఆర్థికశాఖను పర్యవేక్షిస్తోన్న శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె ప్రకటించే అవకాశం ఉంది
12:59 PM, 25 May

ఆర్థికమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.
11:04 AM, 25 May

శ్రీలంక ఆర్థికమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె.
4:53 PM, 24 May

బండుల గుణవర్ధనె, డగ్లస్ దేవానంద, మహీంద అమరవీర, నసీర్ అమ్మద్, రోషన్ రణసింఘె, బుద్ధశాసన, విదుర విక్రమనాయకను తాజాగా మంత్రులుగా నియమిస్తూ శ్రీలంక అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. వారికి శాఖలను కేటాయించారు.
4:45 PM, 24 May

తాజాగా మరో ఎనిమిది మందిని మంత్రులుగా నియమించిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స
3:28 PM, 24 May

పెట్రోల్, డీజిల్ ధరల భారీగా పెరిగిన నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఆదేశాలను జారీ చేసిన శ్రీలంక ప్రభుత్వం. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రోత్సహిస్తామని విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కంచన విజెశేఖర్ తెలిపారు.
3:07 PM, 24 May

గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు పెట్రోల్‌లో 259 శాతం, డీజిల్‌లో 231 శాతం మేర పెరిగినట్లు వెల్లడించిన థింక్ ట్యాంక్ అడ్వొకేట్ ఇన్‌స్టిట్యూట్ అనలిస్ట్ ధననాథ్ ఫెర్నాండో.
2:23 PM, 24 May

డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రాత్రికి రాత్రి 111 రూపాయల మేర పెరగడం వల్ల దాని ప్రభావం రవాణారంగంపై పడింది. ఆటోరిక్షా డ్రైవర్లు తమ ఛార్జీలను భారీగా పెంచారు. ఇదివరకు కనీస ఛార్జీ 80 రూపాయలు ఉండగా.. దాన్ని 90 రూపాయలకు పెంచారు.
2:17 PM, 24 May

శ్రీలంకకు చెందిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు అనుబంధంగా కొనసాగుతున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా అక్కడ తన రేట్లను పెంచింది. ఈ విషయాన్ని లంక ఐఓసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనోజ్ గుప్తా తెలిపారు.
2:13 PM, 24 May

పెట్రోల్, డీజిల్‌ను దిగుమతి చేసుకోవడానికి చేసిన ఖర్చుతో పాటు రవాణా, దాన్ని దేశంలోని వేర్వేరు ఇంధన డిపోలకు తరలించడానికి అయిన వ్యయం, పన్నులను కలుపుకొని వాటి ధరలను నిర్ధారించినట్లు మంత్రి పేర్కొన్నారు.
2:09 PM, 24 May

ఇంధన ధరల ఫార్ములాను నిర్ధారించడానికి శ్రీలంక మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. అనంతరం దీనికి ఆమోదం తెలిపినట్లు విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కంచన విజెశేఖర్ తెలిపారు.
2:06 PM, 24 May

అక్టేన్ 92 పెట్రోల్ ధరలో 24.3 శాతం అంటే 82 రూపాయలు, అక్టేన్ 92 డీజిల్ ధరలో 38.4 శాతం అంటే 111 రూపాయలు పెరిగింది. పెరిగిన ఇంధన ధరలు ఈ తెల్లవారు జామున 3 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.
1:47 PM, 24 May

ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ.. రాజధాని కొలంబో సహా పలు నగరాల్లో కొరత ఏర్పడింది. పలు పెట్రోల్ బంకుల వద్ద నో పెట్రోల్, నో స్టాక్స్ బోర్డులు కనిపించాయి.
1:37 PM, 24 May

శ్రీలంకలో ఇంధన రేట్లు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఇవ్వాళ లీటర్ పెట్రోల్ 420 రూపాయలకు చేరింది. డీజిల్ లీటర్ ఒక్కింటికి 400 రూపాయలు పలుకుతోంది. అయినప్పటికీ అక్కడ ఇంధన దొరకడం గగనంగా మారింది.
1:11 PM, 24 May

ఆర్థిక సంక్షోభం నుంచి ఒడ్డెక్కడానికి భారత్ నుంచి మరో 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరిన శ్రీలంక. ఇందులో అధిక మొత్తాన్ని ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి వినియోగించే అవకాశం ఉంది
10:18 AM, 23 May

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమ దేశానికి మానవతాదృక్పథంతో ఆదుకుంటోన్న భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం పంపించిన పాలు, ఇతర నిత్యావసర సరుకులు శ్రీలంకకు చేరాయి.
12:56 PM, 22 May

జీ7 దేశాలు సహాయ, సహకారాలను అందివ్వడానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె
3:45 PM, 21 May

హింసాత్మక పరిస్థితులను అడ్డుకోవడంలో భాగంగా ఈ నెల 6వ తేదీన అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీని విధిస్తూ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
3:06 PM, 21 May

అత్యయిక పరిస్థితిని ఎత్తేసిన శ్రీలంక ప్రభుత్వం. రెండు వారాల తరువాత తొలిసారిగా దేశంలో ఎమర్జెన్సీని ఎత్తేసిన ప్రభుత్వం
1:52 PM, 21 May

శ్రీలంకలో నెలకొన్న ఇంధన కొరత నేపథ్యంలో పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. కార్యాలయాలు కూడా పరిమితంగా పని చేయాల్సి ఉంటుందంటూ ఉత్తర్వులు జారీ
1:31 PM, 21 May

శ్రీలంకలో మరిన్ని దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి. తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహార కొరత తీవ్రంగా నెలకొంటుందని చెబుతున్నారు.
12:29 PM, 21 May

శ్రీలంక నుంచి వచ్చే శరణార్థుల కోసం తమిళనాడు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. వారి కోసం రామనాథపురం, నాగపట్టిణం వంటి జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది.
READ MORE

English summary
Srilanka Defence Ministry had given shoot at sight orders to the people who are protesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X