Sri Lanka: దేశం వదిలి షిప్ లో పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు ?, కనపడితే కొట్టి చంపేస్తారని రిపోర్ట్ !
శ్రీలంక/ చెన్నై: శ్రీలంకలో రాజపక్స సోదరులు సాగించిన దోపిడీకి చమరగీతం పాడటానికి ఆదేశ ప్రజలు సిద్దం అయ్యారు. శ్రీలంక ప్రజలు తిరగబడి ఆదేశ అధ్యక్షుడి భవనం ముట్టడించారు. ఆందోళనకారులను నియత్రించడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి చివరికి చేతులు ఎత్తేశారు. మా స్టోరీ క్లైమాక్స్ కు వచ్చిందని తెలుసుకున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్స మిలటరి వాహనంలో మిలటరీ స్థావరానికి చేరుకున్నారు. కనపడితే ప్రజలు కొట్టి చంపేస్తారని శ్రీలంక ప్రభుత్వం నిఘా వర్గాలు హెచ్చరించడంతో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్స ఓ షిప్ లో శ్రీలంక వదిలిపారిపోయాడని వెలుగు చూసింది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్స పారిపోతున్న షిప్ ఫోటోలు శనివారం బయటకు రావడంతో వైరల్ అయ్యాయి.

రగిలిపోతున్న శ్రీలంక ప్రజలు
నిత్యవసర వస్తువుల కోరత, పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటడం, ఆహార పదార్థాల కోరతతో శ్రీలంక ప్రజలు తిరగబడ్డారు. గత కొన్ని నెలల నుంచి శ్రీలంక ప్రజలు ఆందోళనకు దిగడంతో మహిందా రాజపక్స, చమల్ రాజపక్స, బాసిల్ రాజపక్స వారి పదవులకు రాజీనా చేశారు. రాజపక్స సోదరుల్లో ఒక్కడు అయిన గొటాబాయ్ రాజపక్స మాత్రం శ్రీలంక అధ్యక్షుడి పదవి నుంచి కిందకు దిగలేదు.

అధ్యక్ష భవనం ముట్టడి
శ్రీలంక అధ్యక్షుడు గొటాబాయ్ రాజపక్స అధ్యక్ష భవనం చుట్టుముట్టిన ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. వేలాది మంది ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులు కాల్పలు జరపడంతో కొందరు చనిపోయారు. సామాన్య ప్రజలు చనిపోవడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు.

మిలటరీ స్థావరానికి అధ్యక్షుడు
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్స నివాసం ఉంటున్న భవనం చుట్టుముట్టారు. ఆందోళనకారులను నియత్రించడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి చివరికి చేతులు ఎత్తేశారు. మా స్టోరీ క్లైమాక్స్ కు వచ్చిందని తెలుసుకున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్స మిలటరి వాహనంలో మిలటరీ స్థావరానికి చేరుకున్నారు.

కనపడితే కొట్టి చంపేస్తారని దేశం వదిలిపారిపోయిన అధ్యక్షుడు ?
కనపడితే ప్రజలు కొట్టి చంపేస్తారని శ్రీలంక ప్రభుత్వం నిఘా వర్గాలు హెచ్చరించడంతో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్స ఓ షిప్ లో శ్రీలంక వదిలిపారిపోయాడని వెలుగు చూసింది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ్ రాజపక్స పారిపోతున్న షిప్ ఫోటోలు శనివారం బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. అయితే షిప్ లో గొటబాయ్ రాజపక్స ఎక్కడికి వెళ్లారు అనే విషయం మాత్రం బయటకు రాలేదు.












Click it and Unblock the Notifications