వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధ్యక్ష ఎన్నికలు: సిరిసేన చేతిలో రాజపక్ష చిత్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు మహీంద రాజపక్ష చిత్తయ్యారు. మైత్రిపాల సిరిసేన చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఓటమిని అంగీకరిస్తూ మహీంద రాజపక్ష అధికారకి నివాసం విడిచి వెళ్లారు. మైత్రిపాల సిరిసేన మెజారిటీ దిశగా దూసుకుపోతుండడంతో ఆయన తన ఓటమిని అంగీకరిస్తూ శుక్రవారం అధికార నివాసం ఖాళీ చేారు.

ప్రజల తీర్పును గౌరవించి అధ్యక్షుడు రాజక్ష టెంపుల్ ట్రీస్‌ను వదిలి వెళ్లారని రాజపక్ష కార్యాలయం నుంచి విడుదలైన ఓ ప్రకటనలో చెప్పారు. తుది ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ మైత్రిపాల సిరిసేనను 4 లక్షల ఓట్ల మెజారిటీతో విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.

Sri Lanka President Mahinda Rajapaksa concedes defeat to opposition candidate Sirisena

అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత రనిల్ విక్రమ్ సింఘేతో మాట్లాడారని, అభినందనలు తెలియజేస్తూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా కొత్త ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారని ఆ ప్రకటనలో తెలిపారు. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ప్రయత్నిస్తూ రాజపక్ష ఈసారి తీవ్రమైన పోటీలో చిక్కుకు ఉన్నారు.

ఈ దశాబ్దంలోనే అత్యంత భారీ పోరాటంగా పరిగణనలోకి వచ్చిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ గురువారంనాడు జరిగింది. చాలా చోట్ల 60 - 70 శాతం ఓటింగ్ జరిగినట్లు సమాచారం. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే, రెండు సార్లు అధ్యక్షుడిగా గెలిచిన 69 ఏళ్ల రాజపక్షకు, 63 ఏళ్ల మాజీ ఆరోగ్య మంత్రి సిరిసేనకు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. భారీ మెజారిటీతో గెలుస్తాననే విశ్వాసంతో రాజపక్ష రెండేళ్ల ముందుగా ఎన్నికలకు పూనుకున్నారు. సిరిసేనకు ప్రధాన ప్రతిపక్షం యునైటెడ్ నేషనల్ పార్టీ మద్దతు పలికింది. దానికితోడు జెహెచ్‌యు లలేదా బుద్ధిస్ట్ మోంక్ పార్టీ కూడా మద్దతు పలికింది.

English summary
President Mahinda Rajapaksa on Friday conceded defeat in Sri Lanka's tightest-ever presidential race and left his official residence, with cumulative results showing opposition candidate Maithripala Sirisena ahead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X