వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sri Lanka: శ్రీలంక చరిత్రలో మొదటిసారి, రహస్య ఓటింగ్ లో పార్లమెంట్ సభ్యులు, అధికారాలు కట్, డేట్!

|
Google Oneindia TeluguNews

కొలంబో/శ్రీలంక: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఆయన పదవికి రాజీనామా చేసిన తరువాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రంగం సిద్దం అయ్యింది. ఈనెల 20వ తేదీన శ్రీలంక కొత్త అధ్యక్షుడు ఎవరు ? అని తేలిపోతుంది. అయితే శ్రీలంక చరిత్రలో మొట్టమొదటిసారి ఆదేశ అధ్యక్షుడి పదవి కోసం పోటీ చేస్తున్న నాయకుడికి పార్టమెంట్ సభ్యులు రహస్యంగా ఓటు వెయ్యడానికి సిద్దం అయ్యారు. 2024 వరకు గొటబయ రాజపక్సే పదవి కాలం ఉన్నా ప్రజలు తిరుగుబాటుతో శ్రీలంక వదిలి పారిపోయిన ఆయన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

సామాన్య ప్రజల ఆగ్రహానికి గొటబయ అధ్యక్ష పదవి ఊడిపోవడమే కాకుండా ఆయన భార్యతో కలిసి దేశం వదిలి పారిపోయే పరిస్థితి ఎదురైయ్యింది. గొటబయ రాజపక్సే రాజీనామాతో శ్రీలంక ప్రజలు పండగ చేసుకుంటున్నారు. అయితే శ్రీలంక కొత్త అధ్యక్షుడి ముందుకు సవాలక్ష కొత్త సవాళ్లు రావడానికి ఏమాత్రం కొదవలేదు అనే విషయం తెలిసిందే. శ్రీలంక కొత్త అధ్యక్షుడికి చాలా వరకు అధికారాలు కత్తిరించే పనిలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వ నిమగ్నం అయ్యింది.

Aunty: ముగ్గురు పిల్లల ఆంటీతో ?, లాడ్జ్ లో మందుపార్టీ, అర్దరాత్రి తేడాలు, ప్రియుడి చేతిలో ఫినిష్Aunty: ముగ్గురు పిల్లల ఆంటీతో ?, లాడ్జ్ లో మందుపార్టీ, అర్దరాత్రి తేడాలు, ప్రియుడి చేతిలో ఫినిష్

 గొటబయ జంప్

గొటబయ జంప్

శ్రీలంక పీకలలోతుల్లో ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. శ్రీలంకలో సామూహిక నిరసనలతో అట్టుడికిపోయింది. ఇంతకాలం దాదాపుగా శ్రీలంకు ఏలేసిన రాజపక్సే ఫ్యామిలీకి శ్రీలంక ప్రజలు సినిమా చూపించారు. సామాన్య ప్రజల దెబ్బతో గొటబయ అధ్యక్ష పదవి ఊడిపోవడమే కాకుండా ఆయన భార్యతో కలిసి దేశం వదిలి పారిపోయే పరిస్థితి ఎదురైయ్యింది.

2024 వరకు నాదే రాజ్యం అనుకున్నాడు

2024 వరకు నాదే రాజ్యం అనుకున్నాడు

2024 వరకు గొటబయ రాజపక్సే పదవి కాలంలో ఉండాల్సి ఉంది. 2024 వరకు శ్రీలంకకు నేనే రాజు అని గొటబయ రాజపక్పే అనేక కలలు క్నాడు. అయితే శ్రీలంక సామాన్య ప్రజలు తిరుగుబాటుతో శ్రీలంక వదిలి పారిపోయిన గొటబయ రాజపక్సే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సామాన్య ప్రజల ఆగ్రహానికి గొటబయ అధ్యక్ష పదవి ఊడిపోయింది.

శ్రీలంక చరిత్రలో మొదటిసారి

శ్రీలంక చరిత్రలో మొదటిసారి

లంక చరిత్రలో మొట్టమొదటిసారి ఆదేశ అధ్యక్షుడి పదవి కోసం పోటీ చేస్తున్న నాయకుడికి పార్టమెంట్ సభ్యులు ఓటు వెయ్యడానికి సిద్దం అయ్యారు. 1978 తరువాత శ్రీలంక అధ్యక్ష పదవి కోసం జరిగే ఎన్నికల్లో ఇంత వరకు పార్లమెంట్ ఎప్పుడు ఓటు వెయ్యలేదు. అయితే శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి శ్రీలంక అధ్యక్షుడి ఎన్నికల కోసం అక్కడి పార్లమెంట్ సభ్యులు ఓటు వెయ్యడానికి సిద్దం అయ్యారు.

డేట్ ఫిక్స్, రహస్య ఓటింగ్

డేట్ ఫిక్స్, రహస్య ఓటింగ్

శ్రీలంక దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే ఆదేశ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈనెల 20వ తేదీన శ్రీలంక కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 225 మంది సభ్యులు ఉన్న పార్టమెంట్ లో ఈనెల 20వ తేదీన రహస్య ఓంటిగ్ జరగడానికి అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు.

ఈరోజు పార్లమెంట్ సమావేశాలు

ఈరోజు పార్లమెంట్ సమావేశాలు

శ్రీలంక కొత్త అధ్యక్షుడికి అధికారాలకు కోత పెడుతున్నామని ఇప్పటికే ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రజలకు హామీ ఇచ్చారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఈరోజు (జులై 16వ తేదీ శనివారం) శ్రీలంక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. శ్రీలంక పార్లమెంట్ సమావేశాల్లో ఏం జరుగుతోంది అంటూ ఆదేశ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

English summary
Sri Lanka’s parliament will convene today and begin proceedings to elect the next president after Gotabaya Rajapaksa fled the country before resigning amidst mass protests triggered by grave economic and political turmoil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X