గోటబాయను పంపేయండి-మాల్దీవుల్లో లంకేయుల నిరసనలు-శ్రీలంకలో కనిపిస్తే కాల్చివేత
శ్రీలంకలో అధ్యక్షుడు గోటబాట రాజపక్సకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అదే సమయంలో మాల్దీవులకు పారిపోయిన రాజపక్సను వెతుక్కుంటూ మాల్దీవులకు వెళ్లి మరీ నిరసనకారులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని విక్రమసింఘే నివాసాన్ని సైతం చుట్టుముట్టి ఆందోళనలు చేపడుతుండటంతో ఎమర్జెన్సీ విధించారు.
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన పదవి నుంచి వైదొలగడానికి కొన్ని గంటల ముందు తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయారు. రాజపక్సే, ఆయన భార్య, ఇద్దరు అంగరక్షకులు శ్రీలంక ఎయిర్ ఫోర్స్ విమానంలో మాల్దీవుల రాజధాని మాలే నగరానికి బయలుదేరినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. రాజపక్సే తన కుటుంబం దేశం నుండి సురక్షితంగా నిష్క్రమించే వరకు తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేయనని సూచించిన తర్వాత ఇది జరిగింది. అంతకుముందు, జూలై 13న తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని అధికారులకు చెప్పారు. అయితే ఆ లోపే ఆయన పారిపోయారు.

మరోవైపు శ్రీలంకలో పరిస్దితుల్ని అదుపులోకి తెచ్చేందుకు అపద్ధర్మ అధ్యక్షుడిగా ఎంపికైన ప్రధాని రణిల్ విక్రమసింఘే తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఆయన నివాసంపైకి కూడా ఆందోళనకారులు చొచ్చుకొస్తున్నారు. దీంతో సైన్యాన్ని రంగంలోకి దించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా నిరసనకారుల్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications