"ట్రంప్.. తనను తాను నాశనం చేసుకుంటున్నాడు"
భారత్ పై 50 శాతం సుంకాలు విధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త స్టీవ్ హ్యాంకే కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్.. తనను తాను నాశనం చేసుకుంటున్నాడని తెలిపారు. భారత్ పై టారిఫ్ నిర్ణయం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ టారిఫ్ పాలసీ ఆర్థికంగా పెద్ద ఉపయోగం లేనిదని పేర్కొన్నారు. ఇక తాజాగా భారత్ పై 50 శాతం సుంకాల భారం పడింది. ఇప్పటికే భారత్ వస్తువులపై 25 శాతం టారిఫ్ లు విధించగా.. తాజాగా ప్రకటించిన మరో 25 శాతం సుంకాలు ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా కు అల్టిమేటం ఇచ్చారు. అయినా పుతిన్.. ట్రంప్ వార్నింగ్ ను లెక్కచేయలేదు. దీంతో యుద్ధం ఆగాలంటే రష్యా ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టాలని భావించిన ట్రంప్.. ఈ మేరకు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై కన్నెర్ర చేశారు. భారత్ వస్తువులపై 50 శాతం టారిఫ్ లు విధించారు. ఇప్పటికే భారత్ వస్తువులపై 25 శాతం టారిఫ్ లు విధించగా.. తాజాగా ప్రకటించిన మరో 25 శాతం సుంకాలు ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆగితే సుంకాలు తగ్గొంచని నిపుణులు భావిస్తున్నప్పటికీ ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై అమెరికాలోని ప్రముఖ ఆర్థికవేత్త, జాన్ హోప్ కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హ్యాంకే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలపై టారిఫ్ లు విధించి ట్రంప్.. తనను తాను నాశనం చేసుకుంటున్నాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని రబ్బిష్ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ తీసుకుంటున్న ఆర్థికపరమైన నిర్ణయాలు అన్నీ తప్పు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ నెపోలియన్ సిద్ధాంతాన్ని ఆయన తెలిపారు. శత్రువులతో పైచేయి సాధించే క్రమంలో తనను తాను కోల్పోవద్దని.. అయితే ట్రంప్ తనను తాను నాశనం చేసుకుంటున్నాడని తెలిపారు. అలాగే అమెరికాలో ఆర్థిక ద్రవ్యోల్బణం ఉందని ప్రొఫెసర్ స్టీవ్ హ్యాంకే అభిప్రాయపడ్డారు. అమెరికాలోని పౌరుల ఖర్చు కంటే అమెరికా జీడీపీ అధికంగా ఉందన్నారు. దీంతో ట్రంప్ ఆర్థికపరంగా తీసుకుంటున్న నిర్ణయాలేవీ సరైనవి కాదని తెలిపారు.

మరోవైపు మరోవైపు భారత వస్తువులపై ట్రంప్ 50శాతం టారిఫ్ లు విధించడం వెనుక ఎటువంటి లాజిక్ గానీ కారణం గానీ లేదని భారత సీనియర్ దౌత్యవేత్త దమ్ము రవి తెలిపారు. టారిఫ్ లు విధించిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇరు దేశాల వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఆగస్టు చివరి వారంలో భారత్ ను సందర్శించే అవకాశం ఉందన్నారు. అటు పుతిన్ సైతం భారత పర్యటనకు రానున్నట్లు, సంబంధిత తేదీలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో పుతిన్ భారత్ కు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications