టీకప్: ఒబామాకి సెల్యూట్ తెచ్చిన తిప్పలు (ఫోటో)
న్యూఢిల్లీ: నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారం అన్నారు మన పెద్దలు. ఐతే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన సెల్యూట్ వివాదాస్పదమైంది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు బరాక్ ఒబామా న్యూయార్క్ వచ్చి హెలికాప్టర్ దిగుతుండగా ఈ ఘటన జరిగింది.
హెలికాప్టర్ దిగుతూ తనకు సెల్యూట్ చేసిన మెరైన్ కార్ప్ గార్డ్స్‌కు సెల్యూట్ చేశారు. ఆయన సెల్యూట్ పెట్టిన కుడి చేతిలో కాఫీ కప్పు కూడా ఉంది. ఇప్పుడదే వివాదాస్పదమైంది. ఈ వీడియోను వైట్ హౌస్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.

చేతిలో కాఫీ కప్పు పట్టుకుని సెల్యూట్ చేయడం గార్డ్స్ ను అవమానపర్చడమేనని కొందరు అమెరికన్లు ఒబామా చర్యను ఖండించారు. ఐతే ఒబామాకు మద్దతు పలికే మరికొంత మంది అధ్యక్షుడు సివిల్ పౌరుడు కాబట్టి, ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. వైట్ హౌస్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోపై 2,740 మంది ఫాలోవర్స్ స్పందించారు.












Click it and Unblock the Notifications