ఫోర్న్‌స్టార్‌తో ట్రంప్‌కు లైంగిక సంబంధాలు నిజమే: మున్యాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోర్న్‌స్టార్ స్టామీ డానియెల్‌కు శారీరక సంబంధం ఉన్నట్టు మరోసారి తేటతెల్లమైంది. డానియెల్ సన్నిహిత మిత్రుడు కెయిత్ మున్యాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వివాహేతర సంబంధాన్ని బయటకు రాకుండా చేసుకొన్న ఒప్పందంలో మున్యాన్‌ కూడ ఉన్నాడు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోర్న్ స్టార్ స్టామీ డానియెల్‌తో శారీరక సంబంధాలున్నాయని గతంలో ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని వైట్ హౌజ్ తీవ్రంగా ఖండించింది.

అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా పోర్న్‌స్టార్‌తో సంబంధాలను బట్టబయలు కాకుండా ఉండేందుకుగాను స్టామీ డానియెల్‌తో ట్రంప్ ఒప్పందం చేసుకొన్నాడని కూడ ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని ట్రంప్ కూడ ఖండించారు.

ట్రంప్‌కు ఫోర్న్‌స్టార్ డానియెల్‌తో సంబంధాలు

ట్రంప్‌కు ఫోర్న్‌స్టార్ డానియెల్‌తో సంబంధాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోర్న్‌స్టార్ స్టామీ డానియెల్‌కు శారీర సంబంధం ఉందని తేలింది. డానియెల్ సన్నిహితుడు కెయిత్ మున్యాన్‌తో ఓ టీవి ఛానెల్ చేసిన ఫోన్ సంభాషణలో డానియెల్‌తో ట్రంప్‌తో సంబంధాలు ఉన్నాయని తేలింది. ట్రంప్‌కు ఫోర్న్‌స్టార్ డానియెల్‌‌కు సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఆ సంభాషణలో మున్యాన్‌ అభిప్రాయపడ్డారు.

పోన్ సంభాషణను వినేవాడిని

పోన్ సంభాషణను వినేవాడిని

తాను లాస్ ఎంజెల్స్‌లోని లోయ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని రెండేళ్ళపాటు ఉన్నానని మున్యాన్ చెప్పారు. 2006 నుండి 2008 వరకు ఆ ఇంట్లో ఉన్నానని ఆయన చెప్పారు. 2006లో ట్రంప్‌ తొలిసారిగా డానియెల్‌తో తొలిసారిగా మాట్లాడాడని ఆయన చెప్పారు.ట్రంప్ మాటలను తనతో పాటు డానియెల్ చేరో చెవిలో హెడ్ సెట్‌పెట్టుకొని వినేవారమని ఆయన చెప్పారు.

శారీరక సంబంధం ఉంది

శారీరక సంబంధం ఉంది

ట్రంప్‌ మాటలు చాలా చిత్రంగా ఉండేవి. తనకు అలాంటిది ఇష్టం లేదని డానియెల్‌ చెప్పింది. కానీ, ట్రంప్‌ మాత్రం ఫోన్‌ చేస్తూనే ఉండేవాడు. నేను మొత్తం ఓ ఏడుసార్లు ఆయన మాటలు విన్నానని మున్యాన్ చెప్పారు. అయితే చివరికి ట్రంప్‌తో డానియెల్‌కు మధ్య శారీరక సంబంధం కుదిరిందని చెప్పారు. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్న విషయం వాస్తవమేనని ఆయన తేల్చి చెప్పారు.

ట్రంప్‌కు డ్రెస్ కూడ వేసుకోరాదు

ట్రంప్‌కు డ్రెస్ కూడ వేసుకోరాదు

తొలుత ట్రంప్ ను వ్యతిరేకించిన డానియెల్ ఆ తర్వాత అతడికి దగ్గరైందని మున్యాన్ చెప్పారు. ట్రంప్‌కు సరిగా డ్రెస్‌ వేసుకోవడం కూడా తెలియదు. ఇద్దరు కలిసి కొన్ని పార్టీలకు కూడా వెళ్లేవారు. అయితే, డ్రెస్‌ సరిగా వేసుకోవాలని డానియెల్‌ సర్దేదని మున్యాన్ చెప్పారు. ఇక ఒప్పందం విషయంపై మాత్రం పూర్తి వివరాలు వెల్లడించలేనని మున్యాన్ ఆ ఛానెల్‌కు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A close friend of Stormy Daniels is confirming her affair with Donald Trump more than a decade ago - saying he listened in on their phone conversations - and defending her efforts to get out of the US$130,000 (S$170,000) hush agreement she made shortly before the 2016 election.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి