వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సరిహద్దు లక్ష్యంగా పాక్ గగనతలంనుంచే దాడులు చేశాం: పాకిస్తాన్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : భారత సరిహద్దులో వైమానిక దాడులు చేసిందని పాక్ ధృవీకరించింది. అయితే ఈ దాడులను తమ గగనతలం నుంచే చేసినట్లు పాక్ వెల్లడించింది. అయితే తాము చేసిన దాడులు ప్రతీకార చర్యల్లో భాగంగా కాదని తమ భూభాగం, గగనతలంను పరిరక్షించుకునే క్రమంలోనే దాడులు చేశామని ఒక ప్రకటన విడుదల చేసింది పాక్ ప్రభుత్వం.

పాకిస్తాన్ దాడులు కూడా చేసింది జనసమర్దత లేని ప్రాంతాల్లోనే అని వెల్లడించింది. దేశరక్షణలో భాగంగానే దాడులు చేశామంటూ ప్రకటనలో పేర్కొంది పాకిస్తాన్. అయితే యుద్ధ వాతావరణం సృష్టించాలన్నది తమ అభిమతం కాదని పాక్ వెల్లడించింది. ఒకవేళ భారత్ రెచ్చగొట్టే పనులకు దిగితే తాము కూడా ఊరుకోబోమని దాడులకు దిగుతామని పాక్ స్పష్టం చేసింది. హెచ్చరికల్లో భాగంగానే పట్టపగలే వైమానిక దాడులు చేశామని పాక్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

Strikes across LoC from within Pak airspace, claims Pakistan

సరిహద్దుల్లో ఎలాంటి అలజడి లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని భారత్ గతకొన్నేళ్లుగా చెబుతోందని గుర్తు చేసిన పాక్.. యుద్ధానికి దిగేలా రెచ్చగొడుతోందని వెల్లడించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉగ్రవాదుల పేరుతో పాకిస్తాన్‌లో దాడులు చేయడం తగదని చెప్పిన పాక్... అలాంటి చర్యలకు దిగితే పాక్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు భారత్‌‌ను కారణంగా చూపి తాము కూడా దాడులకు పాల్పడుతామని తెలిపింది. అయితే ఆ దారిలో వెళ్లడం సరైన పద్ధతి కాదని చెప్పిన పాక్ భారత్ శాంతికి అవకాశం ఇచ్చి చూడాలని పేర్కొంది. సమస్యలను చర్యల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చింది.

ఇదిలా ఉంటే పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాలు జమ్మూ కశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్ గగనతలంలోకి బుధవారం ఉదయం ప్రవేశించాయి. వెంటనే భారత యుద్ద విమానాలు స్పందించడంతో పాక్ యుద్ధ విమానాలు తిరిగి తమ గగనతలంలోకి వెళ్లాయి. ఇక భారత్ విదేశాంగ ప్రతినిధి మీడియా సమావేశం నిర్వహించారు. భారత్‌కు చెందిన ఒక మిగ్ విమానంను పాక్ దళాలు అటాక్ చేశాయని అదే సమయంలో భారత్ కూడా పాక్‌కు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు మిగ్ విమానంలో ఉన్న భారత పైలట్ అదృశ్యమయ్యారని రవీష్ కుమార్ తెలిపారు.

English summary
Pakistan on Wednesday claimed that its air force undertook strikes on the Indian side of the Line of Control “from within Pakistani airspace”. The Pakistan government statement said its strikes “were not a retaliation to continued Indian belligerence”.Pakistan has therefore, taken strikes at non military target, avoiding human loss and collateral damage. Sole purpose being to demonstrate our right, will and capability for self defence.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X