పాకిస్థాన్‌లో ఆత్మాహూతి దాడి, 15 మంది మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరంలో శక్తివంతమైన బాంబు పేలుడు చోటుచేసుకొంది. ఈ ఘటనలో సుమారు 15 మంది మరణించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. మోటార్‌సైకిల్‌పై ఓ వ్యక్తి ఆత్మాహూతి బాంబు దాడికి పాల్పడ్డారని అధికారులు గుర్తించారు.

క్వెట్టా నగరంలో అత్యంత భద్రత ఉన్న ప్రాంతానికి సమీపంలోని ఓ బస్టాప్ వద్ద ఈ పేలుడు సంబవించిందని అధికారులు చెప్పారు. ఆర్మీ అధికారుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి చేసినట్టుగా అధికారులు గుర్తించారు.

Suicide bomber kills 15 in southwestern Pakistan

ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు.

Independence day celebrations : North East women commandos to guard Red Fort | Oneindia News

పాక్ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకకు విఘాతం కల్గించే కుట్రలో భాగంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A suicide bomber on a motorcycle targeted a military truck Saturday with a bomb killing eight soldiers and seven civilians in the southwestern city of Quetta, an official and the military said.
Please Wait while comments are loading...