ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..!
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం నాలుగోవారానికి చేరుకుంది. ముందుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖొమైనీని, టాప్ కమాండర్లను హతమార్చాక ఇక యుద్దం ముగిసిపోతుందని భావించిన అమెరికా-ఇజ్రాయెల్ లెక్కలు పూర్తిగా తప్పాయి. దీంతో ఇరు దేశాలకూ ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. అదే సమయంలో ఖమేనీ వారసుడు మొజ్తబా కొత్త సుప్రీం లీడర్ గా నియమితులయ్యారు. అలాగే యుద్దం కూడా ఆగలేదు. దీంతో చేసేది లేక కాల్పుల విరమణ ప్రయత్నాలు మొదలుపెట్టిన ట్రంప్ (Donald trump) ఇప్పుడు మరో బాంబు పేల్చారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం తనకు సుప్రీం లీడర్ పదవి ఆఫర్ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను దాన్ని తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు. అలాగే నెల రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తాను ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. కానీ ఇరాన్ మాత్రం ఎలాంటి చర్చలు జరగడం లేదని టెహ్రాన్ ఖండించింది.

ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లికన్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్..ఇరాన్ నాయకత్వం తనను ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం లీడర్‌గా చేయాలనే ఆలోచనను అనధికారికంగా ప్రతిపాదించిందని, కానీ తాను దానిని తిరస్కరించానని అసాధారణమైన ప్రకటన చేశారు. మిమ్మల్ని తదుపరి సుప్రీం లీడర్‌గా చేయాలనుకుంటున్నామని ఇరాన్ చెప్పిందని, దానికి తాను.. వద్దు, ధన్యవాదాలు, మాకు అది ఇష్టం లేదు అని చెప్పానన్నారు. అలాగే ఇరాన్‌పై జరిగిన ఆపరేషన్‌ను ట్రంప్ సైనిక విధ్వంసంగా అభివర్ణించి, యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఇరాన్ తో రహస్య చర్చలు పురోగమిస్తున్నాయని, ఆ ప్రభుత్వం కాల్పుల విరమణకు ఆసక్తిగా ఉన్నప్పటికీ, స్వదేశంలో ఎదురయ్యే పరిణామాలకు భయపడి వెనకడుగు వేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications
